టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఎన్నో హిట్టు సినిమాలను తీశాడు. కానీ బ్లాక్ బస్టర్ విజయాలను మాత్రం అందుకోలేదు. డీసెంట్ హిట్స్ అందుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు. ఇంద్రగంటి తన తదుపరి చిత్రాన్ని హీరో నాగచైతన్యతో చేయాలనుకున్నాడు. చైతూ కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాల్సివుంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూనే ఉంది.
ప్రస్తుతం చైతు చాలా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలు లైన్లో పెట్టడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు. ముందుగా విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ‘థాంక్యూ’ సినిమా పూర్తి చేయాలి. ఆ తరువాత ‘బంగార్రాజు’ సినిమాకి కాల్షీట్స్ సర్దుబాటు చేయాలి. దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పిన కథకు ఇటీవల ఓకే చెప్పాడు చైతు. దాంతో ఇప్పుడు ఇంద్రగంటి సినిమా ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ముందు కమిట్ అయినప్పటికీ ఇప్పుడు ఇంద్రగంటి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాలని అనుకుంటున్నాడట చైతు.
ఇంద్రగంటి తీసిన ‘వి’ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడు సుధీర్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. దానిపై కూడా పెద్దగా అంచనాలు లేవు. దీంతో చైతు ఈ ప్రాజెక్ట్ ని కొన్నాళ్లపాటు పక్కన పెట్టేయాలని చూస్తున్నాడట. సుధీర్ బాబుతో ఇంద్రగంటి సినిమా వర్కవుట్ అయితే గనుక చైతు ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!