టాలీవుడ్ బాక్సాఫీస్ (Box-Office) వద్ద కొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. నైజాం ఏరియాలో టాప్ కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో తాజాగా పుష్ప 2 (Pushpa 2) , సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) అదిరిపోయే స్థాయిలో నిలిచాయి. రీసెంట్ గా విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ హవాను కొనసాగిస్తూ భారీ వసూళ్లను సాధించాయి. ముఖ్యంగా పుష్ప 2 నైజాంలో 104.65 కోట్ల షేర్ సాధించి ఆల్ టైమ్ టాప్ 2లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో RRR (RRR) మాత్రమే 111.85 కోట్లతో టాప్‌లో కొనసాగుతోంది.
మరోవైపు వెంకటేష్ (Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం రెండో వారంలోనే 37.64 కోట్ల షేర్‌తో దూసుకెళ్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి సీజన్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ, రెండో వారం కలెక్షన్లు అలాగే స్టడీగా కొనసాగుతుండటం గమనార్హం. ఈ ట్రెండ్ కొనసాగితే త్వరలోనే 40 కోట్ల మార్క్ చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.
ఇకపోతే 2024లో విడుదలైన మరో పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ మూవీ కల్కి 2898 AD (Kalki 2898 AD) నైజాంలో 92.80 కోట్ల షేర్ సాధించి టాప్ 3లో నిలిచింది. ప్రభాస్ (Prabhas) కెరీర్లో అత్యధిక నైజాం షేర్ సాధించిన చిత్రంగా నిలిచిన సలార్ (Salaar) 71.40 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక 2017లో విడుదలైన బాహుబలి 2 (Baahubali 2) ఇప్పటికీ 68 కోట్లతో టాప్ 5లో కొనసాగుతోంది.
ఈ లిస్ట్‌లో మరిన్ని ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) (44.88 కోట్లు), బాహుబలి (Baahubali) (43 కోట్లు), కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF 2) (డబ్) (42.93 కోట్లు), పుష్ప (Pushpa) (40.74 కోట్లు) లాంటి సినిమాలు టాప్ 10లో నిలిచాయి. వీటికి తోడు సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru), హనుమాన్ (Hanu Man), ఆదిపురుష్ (Adipurush) , వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) లాంటి సినిమాలు టాప్ 15లో ఉన్నాయి. ఇప్పటివరకు నైజాంలో అత్యధిక షేర్ సాధించిన చిత్రం RRR అయితే, రాబోయే రోజుల్లో ఈ రికార్డును మరికొన్ని సినిమాలు సవాలు చేసే అవకాశముంది. సంక్రాంతికి వస్తున్నాం కూడా 40 కోట్ల క్లబ్‌లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. వెంకటేష్ (Venkatesh Daggubati), అల్లు అర్జున్ (Allu Arjun) , ప్రభాస్ సినిమాలు టాలీవుడ్ మార్కెట్‌ను ఎలా షేక్ చేస్తున్నాయో ఈ లిస్ట్ చూస్తే అర్థం అవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త రికార్డులు నమోదవుతాయో చూడాలి.
నైజాంలో అత్యధిక షేర్ అందుకున్న సినిమాలు
ఆర్ఆర్ఆర్ – 111.85 కోట్లు
పుష్ప 2 ది రూల్ – 104.65 కోట్లు
కల్కి 2898 ఏడి – 92.80 కోట్లు
సలార్ – 71.40 కోట్లు
బాహుబలి 2 – 68 కోట్లు
దేవర పార్ట్ 1 – 62.90 కోట్లు
అల వైకుంఠపురములో – 44.88 కోట్లు
బాహుబలి – 43 కోట్లు
కేజీఎఫ్ చాప్టర్ 2 (డబ్) – 42.93 కోట్లు
పుష్ప – 40.74 కోట్లు
సరిలేరు నీకెవ్వరు – 39.97 కోట్లు
హనుమాన్ – 39.25 కోట్లు
ఆదిపురుష్ – 39.20 కోట్లు
సంక్రాంతికి వస్తున్నాం – 37.64 కోట్లు (2 వారాలు)
వాల్తేరు వీరయ్య – 36.25 కోట్లు