Mahesh Babu: మే 31.. మహేష్ బాబు థ్రిబుల్ ట్రీట్

  • May 16, 2021 / 01:58 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. స్టార్ హీరోగా క్రేజ్ అందుకున్న తరువాత మహేష్ బాబు మొదటిసారి చాలా విభిన్నమైన లైనప్ ను సెట్ చేసుకున్నాడు. ఇక అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందించబోతున్నట్లు టాక్ అయితే వస్తోంది. ప్రస్తుతం కరోనా ధాటికి ఎవరు కూడా సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టీజర్స్ ను విడుదల చేయడం లేదు.

త్వరలోనే పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తే బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు బూస్ట్ ఇవ్వనున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రతి ఏడాది మే 31న మహేష్ ఎదో ఒక సర్ ప్రైజ్ ఇస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మంచి కిక్కిస్తున్నాడు. ఇక ఈసారి ఒకేరోజు మూడు అప్డేట్స్ ఇస్తారట. సర్కారు వారిపాట ఫస్ట్ లుక్ తో పాటు మాస్ మేకింగ్ వీడియో వస్తుందని సమాచారం.

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న SSMB28 సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, అలాగే మొత్తం యూనిట్ పై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus