Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

నిన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) పుట్టినరోజు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో నిన్నంతా సోషల్ మీడియా మొత్తం విజయ్ పేరు మార్మోగింది. తమిళనాడు రాజకీయాల్లో ఓ సరికొత్త మార్పుని తీసుకొచ్చి సంచలనం సృష్టించారు విజయ్. అందువల్ల విజయ్ కి ఈ బర్డ్ డే స్పెషల్ గా నిలిచింది. అయితే విజయ్ పుట్టినరోజు నాడు త్రిష పేరు కూడా ఎక్కువగా మార్మోగింది అని చెప్పాలి.

Vijay

ఎందుకంటే ఎన్నికలకి ముందు విజయ్- త్రిష రిలేషన్లో ఉన్నారని గట్టిగా ప్రచారం జరిగింది. దీంతో విజయ్ కి అతని భార్య విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించడం కూడా జరిగింది. మరోవైపు అప్పటినుండి త్రిష – విజయ్ బహిరంగంగా తిరుగుతూ వచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా విజయ్- త్రిష స్పెషల్ గా మీట్ అయ్యి సెలబ్రేట్ చేసుకున్నారు. అలాంటిది.. నిన్న విజయ్ పుట్టినరోజు అయితే త్రిష తన సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ పెట్టలేదు.

దీంతో త్రిష- విజయ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు అంటూ ప్రచారం మొదలైంది. ‘విజయ్, త్రిష మధ్య విభేదాలు వచ్చాయని, వారి బంధానికి బ్రేక్ పడిందంటూ’ చాలా కథనాలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు విజయ్ తన భార్యతో తిరిగి కలిసిపోతున్నాడు కాబట్టి.. త్రిషని పక్కన పెట్టాడని కూడా కామెంట్లు చేశారు. వాటికి ఒక్క పోస్ట్ తో ఫుల్స్టాప్ పెట్టి షాకిచ్చింది త్రిష. తన ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ బర్త్‌డే రోజున పక్కనే ఉండి కేక్ కట్ చేయించినట్టు ఓ ఫోటో షేర్ చేసింది.

‘00.00’ అనే నంబర్‌ పెట్టి అర్ధరాత్రి 12 గంటలకే కేక్ కట్ చేయించినట్టు కామెంట్ పెట్టింది త్రిష. దీంతో గాసిప్ రాయుళ్ళ నోర్లు మూయించినట్టు అయ్యింది.

పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus