Vijay: విజయ్‌ కొత్త సినిమా టైటిల్‌… నిర్మాత అర్చన క్లారిటీ?

  • December 21, 2023 / 03:54 PM IST

సినిమాలయందు వెంకట్‌ ప్రభు సినిమాలు వేరయా! అంటుంటారు. ఇంకా సూటిగా చెప్పాలంటే సినిమాల పేర్ల యందు… వెంట్‌ ప్రభు సినిమాల పేర్లు వేరయా అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా పేర్లు, దాని కింద ఇచ్చే ట్యాగ్‌లైన్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్‌లు ఇలా డిఫరెంట్‌గా పేరు పెట్టుకున్నవే. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్‌ చేస్తున్న విజయ్‌ సినిమాకు ఎలాంటి పేరు పెడతారు అనే చర్చ మొదలైంది.

విజయ్‌ 68వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని లెక్క ప్రకారం చూస్తే… ఈ సినిమాకు మరోసారి వెంకట్‌ ప్రభు ఇంట్రెస్టింగ్‌ నేమ్స్‌ రెడీ చేశారు అని చెబుతున్నారు. అవే ‘బాస్‌’, ‘పజిల్‌’. ఈ రెండు పేర్లలో ఒకదానికి ఓకే అవుతారు అంటూ చక్కర్లు కొడుతున్న వార్త సారాంశం. అయితే ఈ విషయంలో ఆ సినిమా నిర్మాత అర్చన కలపతి స్పందించారు.

విజయ్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవా, స్నేహ, లైలా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి, టైటిల్‌ గురించి ఇటీవల అర్చన కలపతి దగ్గర ప్రస్తావిస్తే… ‘‘దళపతి 68’ సినిమాకు సంబంధించి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవాలు కాదు. దర్శకుడు వెంకట్‌ ప్రభు కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకొస్తారు. దానికి అనుకున్న పేర్లు ‘బాస్‌’, ‘పజిల్‌’ కావు. త్వరలోనే సినిమా టైటిల్‌ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. దీంతో క్లారిటీ వచ్చేసింది.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే… ఇందులో (Vijay) విజయ్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారు. అలాగే టెక్నాలజీ చుట్టూ ఈ సినిమా సాగుతుందని టాక్‌. ప్రస్తుతం విదేశాల్లో శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. ఇక విజయ్‌ను కుర్రాడిలా చూపించడానికి ‘డీ ఏజ్‌నింగ్‌ టెక్నాలజీ’ వాడుతున్నారని టాక్‌. అలాగే వచ్చే జనవరి 1న సినిమా టైటిల్‌తో స్పెషల్‌ వీడియో వస్తుంది అని అంటున్నారు. అప్పుడు రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ రావొచ్చు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus