Siddharth First Wife: మొదటి భార్యతో విడాకులు… సిద్దార్థ్ కి ఎంతమందితో ఫైర్ లు ఉన్నాయో తెలుసా?

నాగచైతన్య సమంత విడాకుల ఎపిసోడ్‌తో చిత్ర పరిశ్రమలో గతంలో జరిగిన ఇలాంటి వ్యవహారాలు తెరపైకి వచ్చాయి. అదే సమయంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారు, విడిపోయి ఒంటరిగా వుంటున్న వారి ఉదంతాలను ప్రేక్షకులు గుర్తుచేసుకుంటున్నారు. ఒకవేళ వీరికి గుర్తు లేకపోయినా మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు గుర్తుచేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటున్నాయి.ఇక అసలు మేటర్‌లోకి వెళితే.. ఉదయ్ కిరణ్, తరుణ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో లవర్‌బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సిద్ధార్ధ్. తమిళ నటుడే అయినప్పటికీ.. నువ్వొస్తానంటే నేనొద్దంటనా, ఆట, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగు వారికి బాగా కనెక్ట్ అయ్యారు.

మంచి ఊపులో వున్న సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ అనూహ్యంగా తెలుగు తెరకు దూరమయ్యాడు సిద్ధార్ధ్. ఇతని వ్యక్తిగత జీవితంలోనూ కాంట్రవర్సీలు వున్నాయి. సిద్దార్థ్‌కు మేఘన అనే అమ్మాయితో 2003లో పెళ్లయ్యింది. నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ 2007లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ మేఘన గురించి అత్యంత సన్నిహితులకే తప్పించి.. బయట అంతగా తెలియదు. విడాకుల సమయానికి వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని టాక్. కానీ దీనిపైనా క్లారిటీ లేదు. మేఘన నుంచి సెపరేట్ అయిన తర్వాత పలువురు హీరోయిన్లతో సిద్ధార్ధ్ ప్రేమాయణాన్ని నడిపించాడు.

వీరిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోహా ఆలీ ఖాన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మేఘన నుండి విడిపోవడానికి కూడా సోహానే కారణమని అప్పట్లో మీడియా కోడై కూసింది. అయితే సిద్ధూ, సోహాల బంధం కూడా ఎక్కువ కాలం సాగలేదు.ఇక ఇప్పటి అగ్ర కథానాయిక సమంతతో కూడా సిద్ధూ ప్రేమాయణాన్ని జనం మరిచిపోరు. వీరిద్దరూ కలిసి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్న టైంలో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సమంత నాగచైతన్యకు దగ్గరై అతనిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. సిద్దార్ధ్ చివరిగా ‘ఎనక్కుళ్ ఒరువన్’ అనే తమిళ చిత్రంలో తనతో కలిసి నటించితన దీప సన్నిధితో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వచ్చాయి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus