సినిమా వాళ్ళ జీవితాలు పైకి చూడటానికి రంగుల ప్రపంచంలానే అనిపిస్తుంది. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి అనేది ఎవ్వరికీ తెలీదు. పైకి వారు అందంగా నవ్వుతూ కనిపించినా.. వారిలో ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుంది. ఇవన్నీ చాలా మందికి తెలీదు. అందుకే సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్..లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఒకప్పటి హీరోయిన్ లైఫ్ కూడా ఇలానే అయ్యింది. ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ అవుతుంది.
అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), మోహన్‌లాల్ (Mohanlal), మమ్ముట్టి (Mammootty), విజయ్ (Vijay Thalapathy) వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన అంజూ అరవింద్ (Anju Aravind) ఇప్పటి జనరేషన్ పరిచయం లేకపోయి ఉండొచ్చు. కానీ అప్పట్లో ఈమె ఓ వెలుగు వెలిగింది.. తర్వాత ఎన్నో సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న ఒడిదొడుకులు గురించి చెప్పి వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు. విషయం ఏంటంటే.. అంజు మొదటి పెళ్లి విడాకులతో ముగిసిందట.
కొన్నాళ్ల తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. కానీ పెళ్ళైన కొద్దిరోజులకే రెండో భర్త చనిపోవడం జరిగింది. దీంతో అంజూ డిప్రెషన్ కు గురైంది. దీంతో పెళ్లి తనకు కలిసి రాలేదు అని భావించి.. ఆమె 8వ తరగతిలో తన ఫస్ట్ క్రష్ అయినటువంటి సంజయ్ అంబలపరంబాత్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం అతనితో కలిసి బెంగళూరులో జీవిస్తుంది ఈ అమ్మడు. ‘ఆవల్ వికటన్’ అనే మ్యాగ్ జైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంగతులు అన్నీ చెప్పుకొచ్చింది.