Upasana: ఆ సెంటిమెంట్ ప్రకారం చరణ్ కూతురికి అదృష్టం కలిసొస్తుందా?

  • June 20, 2023 / 08:30 PM IST

చరణ్ ఉపాసనలకు కూతురు పుట్టడంతో మెగా ప్రిన్సెస్ రాక ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని మెగా ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. చరణ్ ఉపాసన కూతురు రాశి మిథున రాశి అని నక్షత్రం పునర్వసు అని సమాచారం. చరణ్ కూతురి జాతకం అద్భుతంగా ఉందని తెలుస్తోంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే జాతకం చరణ్ ఉపాసన కూతురి జాతకం అని సమాచారం. ఆరోగ్యం, ఆర్థిక స్థితి, విద్య, వృత్తి అన్నీ అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది.

చరణ్ ఉపాసన కూతురి జాతకం తల్లీదండ్రుల కీర్తి ప్రతిష్టలు మరింత పెంచే విధంగా ఉందని తెలుస్తోంది. నీ రాకతో కోట్లమందికి ఆనందాన్ని ఇచ్చావంటూ చిరంజీవి ట్వీట్ చేయగా ప్రముఖ సెలబ్రిటీలు సైతం మెగా ప్రిన్సెస్ గురించి సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, లావణ్య త్రిపాఠి, మంచు లక్ష్మి, మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా చరణ్ ఉపాసనలకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తమకు ఎంతో సంతోషంగా ఉందని సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

రామ్ చరణ్ తన కూతురిని చూసి మురిసిపోయాడని సమాచారం. అపోలో ఆస్పత్రిలోని ప్రత్యేక రూంలో ఉపాసన డెలివరీ జరిగిందని బోగట్టా. ఉపాసన, పాపాయి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. చరణ్ తల్లి సురేఖ ఆస్పత్రిలోనే ఉన్నారని బోగట్టా. 2023 మెగా ఫ్యామిలీకి లక్కీ ఇయర్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో భారీ సక్సెస్ దక్కగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలకు పెళ్లి ఫిక్స్ అయింది.

ఉపాసన(Upasana) పండంటి బిడ్డకు జన్మనివ్వడం మెగా ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. చరణ్ ఉపాసనలకు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతుండటంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. చిరంజీవి, పవన్, చరణ్ పుట్టినరోజులలో 2 అనే నంబర్ ఉండగా చరణ్ ఉపాసన కూతురి పుట్టినరోజులో కూడా అదే నంబర్ ఉండటంతో సెంటిమెంట్ పరంగా కూడా మెగా ప్రిన్సెస్ కు కలిసొస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus