పెద్దింటి కోడలు ఉపాసన చాలా ప్రత్యేకం. పుట్టినిల్లు మెట్టినిల్లు పరంగా కోటీశ్వరురాలైన ఉపాసన మల్టీ టాలెంటెడ్. యంగ్ ఎంట్రప్రెన్యూర్ గా అనేక బాధ్యతలు నెరవేరుస్తున్న ఉపాసన సామాజిక సేవలో కూడా ముందుంటారు. అపోలో ఛారిటీ సంస్థల తరుపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాసన కరోనా సమయంలో అపోలో మెడికల్ షాప్స్ నందు సినీ కార్మికులకు ఉచిత మెడిసిన్ అందించడం జరిగింది. కాగా మరో మారు ఉపాసన తన పెద్ద మనసు చాటుకున్నారు.
ఉపాసన ఈ మధ్య శ్రీశైలం వెళ్లారు. లాక్ డౌన్ సడలింపులు నేపథ్యంలో ఆమె ఈ టూర్ వేయడం జరిగింది. శ్రీశైలంలో భగవంతుణ్ణి సందర్శించుకున్న ఉపాసన అక్కడ కూడా ఓ మంచి కార్యక్రమం చేశారు. ఉపాసన గుడిలో కార్యక్రమం పూర్తి అయిన వెంటనే శ్రీశైలం అడవులలో ఓ ట్రిప్ వేశారు. అక్కడ ఉండే ప్రకృతిని ఆస్వాదించిన ఉపాసన అడవులలో గూడెం ప్రజలను కలిశారు. ఆ తెగల ప్రజలలో ఆమె మేమేకం అయ్యారు.
అంతే కాకుండా వారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు తెలుసుకున్నారు. వారికి మెరుగైన జీవన విధానం, ఆరోగ్యం, భద్రత గురించి సలహాలు మరియు సూచనలు ఇచ్చారట. అంతే కాకుండా వారికి నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సాయం చేశారని సమాచారం. ఆ విధంగా ఉపాసన సేవలో మామ చిరంజీవికి మించి పోవడం ఖాయంగా కనిపిస్తుంది.
1
2
3
4
5
Most Recommended Video
భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!