బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా పాల్గొన్న అరియానా ఫైనల్స్ వరకు వచ్చింది కానీ ట్రోఫీ అందుకోలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈమెకి ఇంతటి ఫాలోయింగ్ తెచ్చుపెట్టింది ఆర్జీవీ ఇంటర్వ్యూ అనే చెప్పాలి. ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవీ చేసిన సంచలన కామెంట్స్ తో అరియానాపై అందరి దృష్టి పడింది. ఆ క్రేజ్ తోనే ఆమెకి తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ దక్కింది.
తాజాగా మరోసారి అరియానా.. ఆర్జీవీను ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యాయి. ఇద్దరూ జిమ్ చేస్తూ ఈ ఇంటర్వ్యూను పూర్తి చేశారు. ఈ బోల్డ్ ఇంటర్వ్యూ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. అయితే టీజర్ అనుకున్న సమయం కంటే ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నందుకు అరియనాను క్షమించమని అడిగారు ఆర్జీవీ.
ఇక టీజర్ లో వీరిద్దరూ జిమ్ చేస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కనిపించారు. జిమ్ చేస్తోన్న సమయంలో అరియానాకు వర్మ కొన్ని టిప్స్ కూడా ఇచ్చినట్లు ఉన్నారు. వర్మ స్టైల్ లో అరియనాను రకరకాల భంగిమల్లో చూపించారు. ఇక ఈ టీజర్ జూన్ 19న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?