ప్రయోగాలు చేయడంలో సీనియర్ హీరో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. యూత్ ఫుల్ సినిమాల దగ్గర నుండి ఫ్యామిలీ, మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్లాప్ లు వచ్చినప్పటికీ తన ప్రయత్నాలు మాత్రం నాగ్ ఆపడం లేదు. కానీ ఇప్పుడు ఆయన తన ఆలోచనలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున వయసు అరవై దాటింది. తన వయసు మీద పడిందని గ్రహించిన నాగ్ ఇప్పటికీ యాక్షన్ సీన్లు చేస్తూ ఉంటే ఈ జెనరేషన్ వాళ్లు చూడరనే క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది.
ఇటీవల యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నాగ్ నటించారు. ఈ సినిమాకి దారుణమైన రిజల్ట్ వచ్చింది. దీంతో నాగ్ కి క్లారిటీ వచ్చింది. ఇకపై చేసే సినిమాల్లో యాక్షన్ సీన్లు ఎక్కువ ఉండకుండా చూసుకోవాలని నాగ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రవీణ్ సినిమాల్లో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు ఆ యాక్షన్ సీన్లను తగ్గించి.. ఫ్యామిలీ, రొమాంటిక్ సీన్లు పెంచే పనిలో ప్రవీణ్ సత్తారుతో కలిసి డిస్కషన్లు పెట్టారట నాగ్. దర్శకుడు కూడా హీరోకి నచ్చినట్లే మార్పులు చేసి స్క్రిప్ట్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది!
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?