‘అసలు లేనిదే పెసరపప్పు’ అని పెద్దొళ్ళు అప్పుడప్పుడూ అంటుంటారన్న సంగతి తెలిసిందే. వాళ్ళు అలా ఎందుకు అంటారో.. ప్రభాస్ పెళ్ళి వార్తలు వింటున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. 10 ఏళ్ళ నుండీ పెళ్ళి ఎప్పుడు? అనే ప్రభాస్ ను అడుగుతూనే ఉన్నారు. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ పెళ్ళి ఉంటుందని ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చెప్పుకొచ్చాడు. కానీ ‘సాహో’ వచ్చి కూడా చాలా నెలలు గడిచింది. ఇంకా ప్రభాస్ పెళ్ళి పై క్లారిటీ రాలేదు.
ఇక్కడ ప్రభాస్ ‘బాహుబలి’ తరువాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి.. అతని పెళ్ళి గురించి ఇండియా వైడ్ వార్తలు రావడం మొదలయ్యాయి. మన వాళ్ళు ఎలాగూ ప్రభాస్ పెళ్ళి గురించి వార్తలు రాసి రాసి అలసిపోయారు. కానీ బాలీవుడ్,కోలీవుడ్ వంటి మీడియాలు మాత్రం ఇప్పుడు ప్రభాస్ పెళ్ళి కాన్సన్ట్రేట్ చేసి కొత్త కొత్త వార్తలు రాస్తున్నారు. ఇదిలా ఉంటే.. కృష్ణంరాజు భార్య శ్యామల దేవి గారు ప్రభాస్ పెళ్ళి గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పారు.
అదేంటంటే.. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ కమిట్ అయిన రెండు సినిమాలు పూర్తయ్యాక పెళ్ళి చేసుకుంటాను అని చెప్పాడు. అందుకు తగ్గట్టే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెళ్ళి మాత్రం ఫారిన్ లో ఉంటుంది’ అని తెలియజేసారు. ఇప్పుడు క*నా మహమ్మారి వల్ల విదేశాలకు వెళ్ళే ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. ఇక అక్కడ పెళ్ళి అంటున్నారు అంటే.. ఇక ప్రభాస్ కు పెళ్ళైనట్టే.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!