Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) అనే మాస్ సినిమా రూపొందింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Ustaad Bhagat Singh Collections

‘గబ్బర్ సింగ్’ కాంబోలో రూపొందిన సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై కొంతమంది అభిమానులు హోప్స్ పెట్టుకున్నారు.శ్రీలీల, రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్లుగా నటించారు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘దేక్ లెంగే సాలా’ ‘ఎత్తరా ఎత్తరా’ వంటి సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ సినిమాలో ఉండటం వల్ల ఎటువంటి ట్రోలింగ్ కి తావివ్వలేదు. మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి.కానీ రెండో రోజు నుండి ఈ సినిమాపై ‘దురంధర్ 2’ ఎఫెక్ట్ పడింది. దీంతో కలెక్షన్స్ తగ్గిపోయాయి. వీక్ డేస్ లో మరింతగా డ్రాప్ అయ్యాయి.ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 15.46 cr
సీడెడ్ 6.76 cr
ఉత్తరాంధ్ర 6.31  cr
ఈస్ట్ 4.91 cr
వెస్ట్ 3.42 cr
గుంటూరు 3.92 cr
కృష్ణా 3.64 cr
నెల్లూరు 1.62 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 46.04 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.51 cr
ఓవర్సీస్ 4.18 cr
టోటల్ వరల్డ్ వైడ్ 53.73(షేర్)

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి రూ.122.4 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.123 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.53.73 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.91.5 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.69.27 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus