Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

చరిత్రకారుల గురించి మన పెద్దలు ఓ మాట చెబుతారు. వారు ఏం రాస్తే అది చరిత్ర అయిందని, వారు రాసిందంతా ఒకప్పుడు జరిగి ఉండకపోవచ్చని, అలాగే జరిగిందంతా వారు రాసుండకపోవచ్చని పెద్దల మాటల సారాంశం. ఈ మాటలో నిజం ఎంతుందో చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదివితే తెలిసిపోతుంది. ఇప్పుడు చరిత్ర రాసేవాళ్లు లేరు కాబట్టి.. ఆ విషయాలను సినిమాలు తీసేవారు నచ్చింది తీస్తున్నారా? గత కొన్నేళ్లుగా ఈ మాట కూడా వినిపిస్తోంది. అందులోనూ దేశ భక్తి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాల గురించి ఈ కామెంట్‌ వినిపిస్తోంది.

Dhurandhar

ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ కూడా ఇదే మాట అంటున్నారు. ‘ధురంధర్’ సినిమా పేరెత్తకుండా ఆయన ఆ సినిమా మీద కొన్ని విమర్శలు గుప్పించారు. ‘నీలిర’ అనే సినిమా ఈవెంట్లో వెట్రిమారన్ మాట్లాడుతూ ఈ మేరకు కొన్ని కామెంట్లు చేశారు. ఇటీవల వచ్చిన ఓ సినిమా ప్రాపగండా మూవీగా అని కామెంట్ చేశారు. ఆయన పేరు చెప్పలేదు కదా ‘ధురంధర్‌’ సినిమా గురించే అన్నారు అని మీరెలా అనుకుంటారు అని అంటారా? ఎందుకంటే ఆయన చెప్పింది డీమానిటేజేషన్‌ పరిస్థితి గురించి కాబట్టి.

డీమానిటైజేషన్ టైంలో మన దేశంలో ఎంతోమంది డబ్బుల కోసం క్యూల్లో నిలబడి నానా అవస్థలు పడ్డారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ వ్యవహారం గురించి ప్రజల అభిప్రాయం మారేలా సినిమాలతో కొందరు చేస్తున్నారని వెట్రిమారన్ వ్యాఖ్యానించారు. ఇదంతా చూపించింది ‘ధురంధర్‌’ సినిమాలో కాబట్టి వెట్రిమారన్‌ చెప్పింది ఆ సినిమా గురించే అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చినప్పటి నుండి డీమానిటైజేషన్‌ సీన్స్‌ గురించి ఇలాంటి కామెంట్లు వస్తూనే ఉన్నాయి.

‘ధురంధర్‌’ సినిమాను సినిమాగా తీసుకున్నవారికి ఈ సినిమా కంటెంట్‌ అద్భుతంగా అనిపిస్తోంది. అయితే ఇందులో పొలిటికల్‌ టచ్‌ ఉన్న అభిమానులు మాత్రం ఈ సినిమాను భారతీయ జనతా పార్టీ ప్రాపగంగా సినిమా అని అంటున్నారు. ఇందుకేనేమో ఈ సినిమా విజయం తర్వాత బాలీవుడ్ పెద్దలు ఎవరూ సినిమాను, సినిమా సాధించిన విజయాన్ని ఓపెన్‌గా పొగిడింది లేదు. ఒకవేళ పొగిడితే వారిపై కూడా బీజేపీ సానుభూతిపరులు అనే ముద్ర పడిపోతుందని భయపడుతున్నట్లు ఉన్నారు.

‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus