పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మొదటి నుండి ఈ సినిమాపై ఆడియన్స్ ఫోకస్ ఎక్కువగానే ఉంది.
‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ప్రత్యేకతను సంతరించుకుంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదు అనిపించాయి. పాటల్లో ‘దేఖ్ లేంగే సాలా’ చార్ట్ బస్టర్ అయ్యింది. మిగతా రెండు పాటలు కూడా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానుంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమంది పాపులర్ డిస్ట్రిబ్యూటర్లు వీక్షించడం జరిగింది. సినిమా చూసిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకున్నారు.
వారి టాక్ ప్రకారం చూసుకుంటే… సినిమా 2 గంటల 39 నిమిషాలు ఉంటుందట. ఫస్ట్ హాఫ్ 1 గంట 10 నిమిషాల 9 సెకన్లు, సెకండాఫ్ 1:21:19 సెకన్లు నిడివి కలిగి ఉంటుందట.పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్,ఆ వెంటనే వచ్చే ఫైట్ సీన్ గూజ్ బంప్స్ తెప్పిస్తాయట. నాన్ స్టాప్ గా వచ్చే పంచ్ డైలాగులు అలరిస్తాయట. ఎత్తరా ఎత్తరా సాంగ్ కూడా మంచి కిక్ ఇస్తుంది అంటున్నారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారని అంటున్నారు.
ఇంటర్వెల్ బ్లాక్ కూడా అలరిస్తుంది అని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా పెద్ద పీట వేశారట. సో ఉగాది పండుగకి తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి..!