Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో టాలీవుడ్‌లో మామూలు హైప్ లేదు. ఎప్పుడెప్పుడు థియేటర్ల ముందు రచ్చ చేద్దామా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Ustaad Bhagat Singh

కానీ, రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ బాక్సాఫీస్ లెక్కల విషయంలో ఓ కొత్త టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల విషయంలో వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి.

తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచాలంటే.. మేకర్స్ కనీసం 90 రోజుల ముందే పబ్లిక్ నోటీస్ ఇచ్చి, వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని రీసెంట్‌గా కోర్టు గైడ్‌లైన్స్ ఇచ్చింది. అయితే ‘ఉస్తాద్’ విషయంలో మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు అలాంటి ప్రకటన ఏదీ రాలేదు.

దీన్నిబట్టి చూస్తే తెలంగాణలో ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు దాదాపు లేనట్లేనని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనికి తోడు కొన్ని కోర్టు కేసుల వల్ల ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్, ప్రీమియర్ షోలకు కూడా పర్మిషన్ దొరుకుతుందో లేదోనన్న కన్ఫ్యూజన్ నెలకొంది. ఆంధ్రాలో అయితే ఎర్లీ మార్నింగ్ షోలకి టికెట్ రేట్లు రూ.500 గా చేశారు. అలాగే సింగిల్ స్క్రీన్స్ లో రూ.250, మల్టీప్లెక్సుల్లో రూ.325 గా టికెట్ రేట్లు ఉన్నాయి.తెలంగాణాలోనే ఇంకా ఓ క్లారిటీ రాలేదు.

మరోపక్క ఈ అంశంపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది.ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని న్యాయపరమైన అభ్యంతరాలు ఉన్నాయి, కానీ ఫైనల్‌గా ప్రభుత్వం నుంచి టికెట్ హైక్స్‌తో పాటు బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే, అభిమానుల అసలు బాధంతా డే-1 కలెక్షన్ల గురించే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి రేట్లు పెరిగితే వచ్చే బాక్సాఫీస్ కిక్కే వేరు.కానీ ఇప్పుడు ఏపీలో పెరిగి, తెలంగాణలో సాధారణ రేట్లు ఉంటే మాత్రం కలెక్షన్ల నంబర్స్‌పై కచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది.

నిర్మాతలకు వచ్చే లాభనష్టాలు ఎలా ఉన్నా.. ‘మొదటి ఆట.. మొదటి రోజు.. మొదటి వారం’ అంటూ సోషల్ మీడియాలో రికార్డుల గురించి కాలర్ ఎగరేసి చెప్పుకునే ఛాన్స్ ఎక్కడ మిస్ అవుతామో అని పవన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మేకర్స్ ఈ టికెట్ల చిక్కుముడిని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.

అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus