Vakeel Saab TRP: వకీల్ సాబ్ కు అంత టీఆర్పీ వస్తుందా?

  • July 21, 2021 / 07:05 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఆదివారం రోజున జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కాగా ఈ సినిమాకు ఏకంగా 32.20 టీఆర్పీ రేటింగ్ వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమా బుల్లితెరపై తొలిసారి ప్రసారమైన సమయంలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ టీఆర్పీ హైయెస్ట్ టీఆర్పీ కాగా వకీల్ సాబ్ నిజంగా 32.20 స్థాయిలో టీఆర్పీ సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.

బార్క్ ప్రతి గురువారం రోజున టీఆర్పీ రేటింగ్ వివరాలను వెల్లడిస్తుంది. గత ఆదివారం ప్రసారమైన వకీల్ సాబ్ రేటింగ్ జులై నెల 29వ తేదీన వెల్లడి కానుంది. థియేటర్లలో కరోనా సెకండ్ వేవ్ వల్ల వకీల్ సాబ్ ను చూడలేని ప్రేక్షకులు టీవీలలో సినిమాను చూసి ఉంటారని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అల్లుడు అల్లుఅర్జున్ మూవీ రేటింగ్ ను పవర్ స్టార్ అధిగమిస్తారో లేదో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

మరోవైపు పవన్ తన తరువాత సినిమల షూటింగ్ లను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఒకే సమయంలో రెండు సినిమాలలో నటిస్తూ ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా పవన్ కళ్యాణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. 2021 ఫస్ట్ హాఫ్ లో పవన్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలతో పాటు పవన్ కొత్త సినిమాలకు కూడా కమిటవుతున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus