ఆ తెలుగు హాలీవుడ్‌ నటి మళ్లీ టాలీవుడ్‌కి వచ్చింది.. ఎవరో తెలుసా?

రోషన్‌, అనస్వర రాజన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ఛాంపియన్‌’ సినిమా గురించి చాలామంది మాట్టాడుతున్నారు. ఆ సినిమా కాన్సెప్ట్‌ ఆసక్తికరంగా ఉండటం ఒక కారణమైతే.. అందులో జోడీ కంటికి ఇంపుగా ఉండటం మరో కారణం. దీనికి ఇప్పుడు మరో కారణం యాడ్‌ అయింది. అదే అవంతిక వందనపు. ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. చిన్న పిల్లగా ఓ వంట నూనె యాడ్‌లో చేసి ఫేమస్‌ అయింది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. వాటితో ఎంత పేరు తెచ్చుకుందో అంతకుమించి ఓ హాలీవుడ్‌ సినిమాలో నటించి సంపాదించింది.

Avantika Vandanapu

ఇప్పుడు ఆమె ‘ఛాంపియన్‌’ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లతో రోషన్‌తో కలసి ఆడిపాడింది. దీనికి సంబంధించి వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. దీంతో మరోసారి అవంతిక గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. పనిలో పనిగా సినిమా గురించి మాట్లాడేస్తున్నారు. పైన చెప్పినట్లు అవంతిక ఈ సినిమాకు ముందు బాలనటిగా ‘బ్రహ్మోత్సవం’, ‘ప్రేమమ్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘అజ్ఞాతవాసి’ తదితర సినిమాల్లో నటించింది. అయితే ‘స్పిన్’; ‘మీన్ గర్ల్స్’ సినిమాలతో అటు హాలీవుడ్‌లో, ఇటు ఇక్కడ పేరు తెచ్చుకుంది.

అప్పటివరకు క్యూట్‌గా కనిపించిన అవంతిక ఒక్కసారి ‘మీన్ గర్ల్స్’ కోసం హాట్ డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాను షేక్ అయిపోయింది. ఇక ఆ సినిమా ప్రచారంలో అవంతిక లుక్, గ్లామర్‌, డ్రెస్సింగ్‌ సెన్స్‌, అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్‌కి మనోళ్లు ఫిదా అయిపోయారు. మరిప్పుడు తెలుగులో స్పెషల్‌ సాంగ్‌లో ఎలా థియేటర్లలో అరిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తే అవంతికకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావచ్చు.

అయితే, ఆమెకు ఇక్కడ వరుస సినిమాలు చేయాలని ఉందా? లేదా? ‘ఛాంపియన్‌’ సినిమాలో పాత్రను సీరియస్‌గానే చేసిందా? లేక ఎవరైనా అడిగితే చేసిందా అనేది ఆమె కానీ, చిత్రబృందం కానీ మీడియా ముందు వస్తేనే తెలుస్తుంది. చూద్దాం ఈ నెల 25న సినిమా వచ్చాక అసలు విషయాలు తెలుస్తాయి.

‘మైసా’ మూవీ గ్లిమ్ప్స్ రివ్యూ.. రష్మిక ఇంకో హిట్టు కొట్టేలా ఉందిగా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus