Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

వరుస పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ల తరువాత దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మొదటి సారి రాముడి గెటప్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘మందాకినీ’ క్యారెక్టర్ లో నటిస్తుంది. మలయాళ స్టార్ పృథ్వి రాజ్ ‘కుంభ’ క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కే ఈ మూవీ పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దాంతోపాటు డైరెక్టర్ రాజమౌళి నిర్ణయంతో చిత్ర యూనిట్ ‘వారణాసి’ చిత్రానికి భారీ మొత్తంలో కేవలం ప్రమోషన్స్ కోసమే కేటాయించినట్టు ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటో చూసేద్దాం రండి.

Varanasi

ఇక విషయానికొస్తే, సినిమాను ప్రమోట్ చేయటంలో దర్శక ధీరుడు రాజమౌళి పెట్టింది పేరు అన్న విషయం అందరికి తెలిసిందే. ఈసారి అభిమానుల అంచనాలను ఇంకో మెట్టు మించుతూ, ఏకంగా ‘వారణాసి’ చిత్రానికి 75 కోట్లు కేవలం ప్రమోషన్స్ కే కేటాయించబోతున్నారని గట్టిగా వినపడుతున్న టాక్. ఈ విధంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని గ్లోబల్ రేంజ్లో ప్రమోట్ చేయబోతున్నారు. మామూలుగానే రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఒక రేంజ్లో ఉంటాయి. ఇక అంత మొత్తంలో బడ్జెట్ కేటాయించారంటే ఆడియన్స్ ఊహలకు కూడా అందదు. ఈ మధ్యనే రిలీజ్ డేట్ విషయంలో కూడా వారణాసి నగరమంతా హోర్డింగ్స్ పెట్టి అందర్నీ ఆశ్యర్యానికి గురి చేసాడు. ముందు ముందు ఇంకా ఎం ప్లాన్ చేసాడో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus