ఆ రెండు సినిమాలు చేసుంటే వరుణ్ సందేశ్ మరో రేంజ్లో ఉండేవాడేమో..!

  • February 12, 2020 / 04:19 PM IST

కెరీర్ ప్రారంభంలో ‘హ్యాపీ డేస్’ ‘కొత్త బంగారులోకం’ ‘ఏమైంది ఈవేళ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న వరుణ్ సందేశ్ ను.. ఆ తరువాత వరుస ప్లాప్ లు వెంటాడడంతో అమాంతం కిందికి పడిపోయాడు. ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ‘డి ఫర్ దోపిడి’ ‘మామ మంచు అల్లుడు కంచు’ వంటి మల్టీ స్టారర్ ప్రయత్నాలు కూడా ఈ కుర్ర హీరోకి వర్కౌట్ కాలేదు. ఆ తరువాత వితిక ను పెళ్ళిచేసుకుని సినిమాలకి కాస్త దూరంగా ఉంటూ వచ్చిన వరుణ్ సందేశ్.. గత ఏడాది ‘బిగ్ బాస్3’ కి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షోలో చివరి వరకూ వరుణ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానే కనిపించినా చివరికి విన్నర్ కాలేకపోయాడు. దీంతో వరుణ్ సందేశ్ ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ అంతా చాలా హర్ట్ అయ్యారు. ఇది పక్కన పెడితే ఇటీవల వరుణ్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. తాను రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను వదిలేసుకున్నట్టు చెప్పి పెద్ద షాకిచ్చాడు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ… ‘హ్యాపీడేస్’ చిత్రం చేస్తున్న టైములో నా వయసు 18 ఏళ్ళు. కథల విషయంలో అప్పుడు నాకు జడ్జిమెంట్ తెలీదు. అందుకే కథలని నాన్నగారు విని ఓకే చేసేవారు. ఆయనకు కూడా కథల ఎంపికలో అనుభవం లేదు. దాంతో కొన్ని చిత్రాలు తప్ప మిగిలినవి ఫెయిల్ అయ్యాయి. ‘భీమిలి కబడ్డీ జట్టు’ వంటి ఎన్నో చిత్రాలు మిస్ చేసుకున్నాను. అంతేకాదు ‘100%లవ్’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా ఎన్నో వదులుకున్నాను.. నాకు రాసిపెట్టి లేదు… అంతే..!” అంటూ చెప్పుకొచ్చాడు. నిజంగా ‘100% లవ్’, ‘గుండెజారి గాల్లందయ్యిందే’ చిత్రాలు వరుణ్ చేసి ఉంటే అతని రేంజ్ మరోలా ఉండేదేమో..!


జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus