Varun, Lavanya: వరుణ్ – లావణ్య ల ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎన్ని లక్షలో తెలిస్తే మతిపోతుంది..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం శుక్రవారంనాడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగిణ విషయం తెలిసిందే.. ఈ కార్యక్రమాన్ని నాగబాబు ఇంట్లోనే నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి నాగబాబు తల్లి అంజనా దేవి, చిరంజీవి దంపతులు,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం, అల్లు బాబీ కుటుంబం, అల్లు శిరీష్, డాక్టర్ వెంకటేశ్వరరావు కుటుంబం, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, ఇతర బంధువులు హాజరయ్యారు..

ఇక వీరిద్దరి ఎంగేజ్మెంట్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రిలేషన్షిప్ పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. అయితే ఎంగేజ్మెంట్ ఫోటోలను లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..వారి ప్రేమ ఎప్పుడు పుట్టిందనే విషయాన్ని రివిల్ చేశారు..2016 నుంచి మేము ప్రేమించుకుంటున్నామంటూ పలు ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో నిశ్చితార్థంలో వీరిద్దరూ చాలా ఖరీదైన ఉంగరాలు తొడిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి..

డైమండ్ రింగ్స్ కావడంతో ఒక్కో ఉంగరం ఖరీదు రూ..12 లక్షలు పైగానే, మొత్తం రెండు కలిపి రూ.25 లక్షలు ఉండవచ్చునని అంచనా.. అలాగే వీరు వేసుకున్న డ్రెస్సులు వరుణ్ రూ .2 లక్షల విలువైన కూర్త పైజామా, లావణ్య త్రిపాఠి రూ .3 విలువైన బెనారస్ సారి కట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది.. వీరిద్దరి డెస్టినేషన్ ప్రకారం ఇటలీలో పెళ్లి జరగనుందని వార్త వైరల్ అవుతుంది..

అక్కడ పెళ్లిని గ్రాండ్ చేసి, ఇక్కడ రీసెప్షన్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించే ఆలోచనలో మెగా కుటుంబం ఉన్నట్లు సమాచారం.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే మెగా ఫ్యామిలి క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే..

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus