దాదాపు ఆరేళ్ల తమ ప్రేమను వివాహబంధంగా మార్చుకున్నారు నటుడు వరుణ్ తేజ్ – నటి లావణ్య త్రిపాఠి. ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్ మూడుముళ్లు వేసి వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇప్పటికే కాక్‌టైల్, మెహందీ, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే!
అయితే పెళ్లి అనంతరం కొత్త జంట నమస్కరిస్తున్న ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు వరుణ్-లావణ్యల జంట చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అలాగే చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఇలా కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన అగ్ర, యువ హీరోలందరూ షూటింగ్స్ నుంచి బ్రేక్స్ తీసుకుని ఈ వేడుకల్లో సందడి చేశారు.
నూతన వధూవరులకు (Varun Tej, Lavanya) శుభాకాంక్షలు తెలిపారు. నితిన్, ఆయన సతీమణి షాలినీ, నీరజా కోన ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!