Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Advertisement

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా సూర్యకి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కొన్నాళ్ల నుండి సూర్యకి సరైన హిట్టు పడలేదు. ఇటీవల సూర్య నుండి వచ్చిన సినిమాలు అన్నీ డిజప్పాయింట్ చేశాయి.

Veerabhadrudu

‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ వంటి ఓటీటీ హిట్లు మినహా.. తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన ‘ఈటి’ ‘కంగువా’ ‘రెట్రో’ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అయ్యాయి.

అయినప్పటికీ సూర్య క్రేజ్ కానీ, మార్కెట్ ఏమీ తగ్గలేదు.అతని లేటెస్ట్ మూవీ ‘వీరభద్రుడు'(Veerabhadrudu) మే 14న రిలీజ్ కావాలి. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగా ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసిందో? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి :

నైజాం 2.5 cr
సీడెడ్ 1.0 cr
ఆంధ్ర(టోటల్) 3.2 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 6.7 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.50 cr
వరల్డ్ వైడ్ టోటల్ 7.2 cr

‘వీరభద్రుడు’ తెలుగు వెర్షన్ కి రూ.7.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. టార్గెట్ చిన్నదే కాబట్టి సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే కష్టమే..! ఏదేమైనా ‘వీరభద్రుడు’ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు కూడా కొంత హోప్స్ అయితే పెట్టుకున్నారు. చూడాలి మరి వారి నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందో లేదో..!

ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags