Venu: ఆ నటుడితో హీరో వేణుకు గోడవకు కారణం ఏంటో తెలుసా!

ఒకప్పుడు వరుసగా సినిమాలలో హీరోగా తన కామెడీ టైమింగ్ తో అందరిని కడుపుబ్బా నవ్వించ్చాడు హీరో వేణు .. అదే విధంగా.. సహాయ నటుడుగా కూడా నటించారు.. ఈ హీరో స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన వేణు ఆ తర్వాత పెళ్ళాం ఊరెళితే , హనుమాన్ జంక్షన్, చిరునవ్వుతో వంటి సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ దమ్ము సినిమాలో నటించి ఇండస్ట్రీకి దూరమైన చెన్నైలో స్థిరపడి పలు వ్యాపారాలు చేస్తూ ఫుల్ బిజీగా అయ్యాడు..

చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ హీరో రీసెంట్ గా రవితేజ నటించిన ఆన్ డ్యూటీ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ పోషించిన ఈయన తన సినీ కెరియర్ లో బిజీ అవ్వాలను కుంటున్నప్పటికీ కూడా అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదని చెప్పాలి..మంచి కథ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన జగపతిబాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.. దాంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..ఒక వ్యక్తికి డబ్బు అప్పుగా ఇవ్వగా..

జగపతిబాబు గారు హామీ ఇచ్చి పంపించారు. అయితే ఆ వ్యక్తి డబ్బు ఇప్పటికి కూడా ఇవ్వలేదు. అలా రూ.14 లక్షలు నేను పోగొట్టుకున్నాను. ఆ సమయంలో నాకది చాలా ఎక్కువ డబ్బు అయితే జగపతిబాబు గారు కనీసం ఫోన్ చేసి ఆ తర్వాత ఒకసారి కూడా డబ్బులు ఇచ్చాడా అని అడగలేదు. ఇక ఆ గొడవని నేను వదిలేసాను.. ఇక అతడు ఇవ్వడు అని నాకు అర్థం అయింది.

అయితే,ఆ తర్వాత జగపతిబాబు గారు మళ్ళీ నాతో మాట్లాడటం మానేయడం మరింత బాధ కలిగించింది అంటూ తెలిపారు.. డబ్బు కోసం మిత్రుడిని కూడా వదిలేస్తారా అని ఇప్పటికి అదే ఆలోచన నాకు ఉంది అంటూ వేణు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.. ఇక తన ఫ్యామిలి రాజకీయ చరిత్ర గురించి చెప్పుకొచ్చాడు.. ఇప్పుడు వేణు (Venu) ఒకవైపు సినిమాలో నటిస్తూనే, మరోవైపు సొంత వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నాడు.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus