Venu Swamy: రామ్ చరణ్ కూతురి జాతకం గురించి వేణు స్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • June 21, 2023 / 03:20 PM IST

వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ జ్యోతిష్యుడుగా సినీ రాజకీయ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను చెబుతూ తరచు వార్తలు నిలుస్తున్నారు. అయితే తాజాగా మెగా ఇంటిలోకి మూడో తరం వారసురాలు అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా ప్రిన్సెస్ అద్భుతమైన ఘడియలలో పుట్టిందంటూ చిరంజీవి కూడా తెలియజేశారు. అయితే తాజాగా వేణు స్వామి రామ్ చరణ్ కూతురి జాతకం గురించి తెలిపారు. ఈ సందర్భంగా వేణు స్వామి రాంచరణ్ కుమార్ పుట్టిన ఘడియలు ఆధారంగా తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియజేశారు.

చిన్నారి పునర్వసు నక్షత్రము, రెందవపాదము, మిధున రాశి. జన్మనామము కోణంగి అని తెలిపారు. ఇక పాప తల్లిదండ్రులైన రామ్ చరణ్ ది రోహిణి నక్షత్రం, ఉపాసనది కృత్తిక నక్షత్రం, వారి పాపది పునర్వసు నక్షత్రం అని తెలిపారు. ఈ ముగ్గురు కూడా దైవిక అంశం అయినటువంటి నక్షత్రాలలో జన్మించారని వేణు స్వామి తెలిపారు. ఇలా చిన్నారి పునర్వసు నక్షత్రములు జన్మించడం వల్ల ఈమె జాతకం చాలా అద్భుతంగా ఉందని భవిష్యత్తులో తాను తన తాత తండ్రిని మించి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటుందని వేణు స్వామి తెలియజేశారు.

పాప జాతకంలో రాజయోగం ఉందని ఈయన రామ్ చరణ్ కూతురు జాతకం గురించి వివరించారు.అయితే చిన్నారికి పంటికి, చెవికి సంబంధించిన చిన్న సమస్యలు కూడా ఉంటాయని ఈయన తెలియజేశారు. ఇక పాప జాతకం ఆధారంగా తనకు తోబుట్టువులు కూడా ఉండరని తెలుస్తోంది.

అంటే రామ్ చరణ్ ఉపాసనలకు మరో సంతానం ఉండబోదని ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశారు. ఇక మగసంతానం అసలు ఉండదంటూ (Venu Swamy) వేణు స్వామి ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus