Samantha, Sreeja: సమంత, శ్రీజ..ల లైఫ్ గురించి వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

వేణు స్వామి.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 2.. టైంలో ఇతను పాపులర్ అయ్యాడు. అయితే అప్పుడు హేతు వాది బాబు గోగినేని చేతిలో ట్రోలింగ్ కి గురవ్వడం వల్ల పాపులర్ అయ్యాడు. అదే టైంలో ఇతను .. స్టార్ హీరోయిన్ సమంత తన భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటుందని చెప్పాడు. అలాగే రాంచరణ్ – ఉపాసన..లు ఆలస్యంగా తల్లిదండ్రులు అవుతారని చెప్పాడు. అవి నిజం అయ్యాయి.

కాబట్టి.. వేణు స్వామికి రాధే శ్యామ్ లో ప్రభాస్ చేసిన విక్రమాదిత్య పాత్రకి ఇచ్చిన ఎలివేషన్స్ అంతా ఇస్తున్నారు. వేణు స్వామి పలికిందే వేదం అనే స్థాయికి కొంతమంది జనాలు వచ్చేశారు. అంతే కాదు సెలబ్రిటీలు అయినటువంటి నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి వారు వేణు స్వామితో పూజలు , హోమాలు వంటివి కూడా చేయించుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.

ఇదిలా ఉండగా.. (Samantha) సమంత , శ్రీజ ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయం పై కూడా వేణు స్వామి స్పందించారు. సమంత టైం ఇప్పుడు అస్సలు బాలేదని, ఆమె రెండో పెళ్లి చేసుకున్నా ఆరోగ్య సమస్యలు ఇంకా పెరుగుతాయని వేణు స్వామి చెప్పాడు. ఇక శ్రీజది కూడా పవన్ కళ్యాణ్ జాతకమే అని చెప్పిన వేణు స్వామి … ఆమె మూడో పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పుకొచ్చాడు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus