ఎప్పుడో నవంబరులో జరిగిన ఓ ప్రమాదం వీడియోను ‘విదామయూర్చి’ సినిమా టీమ్ ఇటీవల రిలీజ్ చేసింది. డూప్ లేకుండా అజిత్ (Ajith Kumar) ఓ యాక్షన్ సన్నివేశాన్ని చేశాడని, ఈ క్రమంలో యాక్సిడెంట్ అయిందని.. అజిత్‌తోపాటు మరొక నటుడికి గాయాలయ్యాయని వీడియో చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ విషయం చెప్పడంలో కాస్త కన్ఫ్యూజ్ ఉండటంతో ఇప్పుడు అజిత్ టీమ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అజిత్ రియల్ స్టంట్ వీడియో చూసి కొందరు అభిమానులు అజిత్ ఇప్పుడెలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
దీంతో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేద్దామని అజిత్ టీమ్ ముందుకొచ్చింది. ‘‘సినిమా నిర్మాణ సంస్థ షేర్ చేసిన యాక్సిడెంట్ వీడియో గతేడాది నవంబర్ చివరి వారంలో తీసినదని, ఇప్పుడు అజిత్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. వీడియోలో చూపించిన యాక్షన్ సీక్వెన్స్‌ను హైవేపై షూట్ చేశారని చెప్పిన టీమ్.. ఆయన నడిపిన కారు టైరులో గాలి తగ్గిపోవడం వల్ల అది అదుపుతప్పి బోల్తా పడిందని చెప్పింది. కారులో ఉన్న అర్ణవ్, అజిత్‌ను సినిమా టీమ్ ఆసుపత్రికి తీసుకువెళ్లిందని, వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపిది.
ఆ తర్వాత మూడు గంటల్లోనే తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు అని కూడా చెప్పింది. ‘ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో..’ అంటూ ఆ వీడియోకు సినిమా టీమ్ ట్యాగ్ లైన్ రాసింది. కానీ ఏమైందో ఏమో జనాలు మాత్రం మరోలా అర్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు అజిత్ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక సినిమా సంగతి చూస్తే… మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ‘విదా ముయార్చి’లో త్రిష (Trisha) హీరోయిన్గా నటిస్తోంది.
రూ. 200 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అన్నట్లు ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో అజిత్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో క్లారిటీ వస్తే… ఇటు బన్నీ సినిమా విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. ఏప్రిల్ 8న ఈ విషయంలో స్పష్టత వస్తుంది అంటున్నారు.
https://twitter.com/LycaProductions/status/1775798815926395119?t=CtRxkfFi4IPRLEEKILpyuw&s=19