Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

విజయ్‌ దేవరకొండ vs ట్రోలర్స్‌. ఇది ఇప్పటి బంధం కాదు. విజయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా చేసినప్పటి నుండి టాలీవుడ్‌లో ఈ అనుబంధం నడుస్తోంది. ఆ సినిమాకు, ఆ తర్వాత ‘ట్యాక్సీ వాలా’ సినిమాకు విజయ్‌ చేసిన ప్రచారం కొత్తగా అనిపించినా.. ఆ తర్వాత నాయిస్‌ ఎక్కువవుతోంది. శ్రుతి మించుతోంది అనే మాటలు వినిపించాయి. సినిమాలు చేయాల్సిన సౌండ్‌ని విజయ్‌ ప్రచారంలో మాత్రమే చేస్తున్నాడు అంటూ విజయ్‌ సోషల్‌ మీడియా వాల్స్‌ మీదే మాట్లాడుతున్నారు.

Vijay Deverakonda

ఈ క్రమంలో విజయ్‌ యాటిట్యూడ్‌, అప్రోచ్‌ నచ్చి.. ‘రౌడీ హీరో’, ‘కొండన్న’ అంటూ పిలుచుకుని మురిసిపోయే వాళ్లూ ఉన్నారు. రౌడీ బ్రాండ్ దుస్తుల వ్యాపారం, దేవరకొండ ఫౌండేషన్‌ లాంటి మంచి పనులు చేస్తూ ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నాడు విజయ్‌. ఇటీవల రష్మిక మందనతో పెళ్లి జరిగాక ఆయన చేసిన కొన్ని మంచి పనులు కూడా మెచ్చుకున్నారు. అయితే విజయ్‌ నుండి సినిమా వస్తోంది అనేసరికి.. ఇటు నెటిజన్లు, అటు ఆయన మారిపోతూ ఉంటారు.

అప్పటివరకు తనంత తోపు ఎవరూ లేరు అనే కాన్ఫిడెన్స్‌తో మాట్లాడి, మంచి పనులు చేసే విజయ్‌.. తన సినిమా వస్తోంది అనేసరికి ‘తాను బాధితుడిని’ అనే ట్యాగ్‌ బయటకు తెస్తారు. టాలీవుడ్‌లో ట్రోలింగ్‌ని ఎదుర్కోని హీరో లేడు. అభిమానం ఉన్న దగ్గర ట్రోలింగ్‌ ఉంటుంది. అయితే అది శ్రుతి మించకూడదు. విజయ్‌ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. విజయ్ ఏమన్నా ట్రోల్‌ చేస్తూ ఉంటారు.

దీనంతటికి కారణం ఏంటా అని చూస్తే.. విజయ్‌ తనంతట తానే ట్రోలర్స్‌కి స్టఫ్‌ ఇవ్వడం. ‘లైగర్‌’ సినిమా సమయంలో స్టేజీల మీద చేసిన కామెంట్స్‌, మరో సినిమా ప్రెస్‌ మీట్‌లో కెమెరా ముఖాన కాలు పెట్టి మాట్లాడటం లాంటివి చూశాం. ఇప్పుడు తన సినిమాను ‘జైలర్‌ 2’ పేరు చెప్పి తొక్కేస్తారు అనడం కూడా ఇలాంటిదే. లేనిపోని ఆలోచనలు ఇచ్చి.. వేరే సినిమా పేరు లాగి అనవసరంగా ఆ సినిమా విషయంలో, ఆ హీరో ఫ్యాన్స్‌ విషయంలో చెడ్డవడం.. విజయ్‌కి చేటు అని కచ్చితంగా చెప్పొచ్చు. ఇదంతా చూస్తుంటే నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను అనేలా ఉంది పరిస్థితి.

కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus