Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

క్రికెట్‌లో బ్యాటర్‌కి ఎలా అయితే కరక్షన్‌ టైమ్‌ తక్కువగా ఉంటుందో.. సినిమాల్లో హీరోలకు కూడా అలానే తక్కువ టైమ్‌ ఉంటుంది. మ్యాచ్‌ మ్యాచ్‌కు బాగా ఆడుతూ.. కెరీర్‌ని బిల్డ్‌ చేసుకున్నట్లే హీరోలు కూడా సినిమా సినిమాకు బాగా చేస్తూ, మంచి కథలు ఎంచుకుంటూ ముందుకెళ్లాలి. లేదంటే అసలుకే మోసం వస్తుంది. ఒక సినిమా ఆడకపోతే మరో సినిమాకు అయినా ఎక్కడ తప్పు జరిగిందో చెక్‌ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే కెరీర్‌ ఇంకా ఇబ్బందుల్లో పడుతుంది.

Vijay Devarakonda

ఇప్పుడు, ఇదే పరిస్థితి విజయ్ దేవరకొండకు వచ్చిందా? అవుననే అనిపిస్తోంది ఆయన సినిమాలు, వాటి ఫలితాలు చూస్తుంటే. ఈ విషయంలో మీకు సింపుల్‌ క్లారిటీ రావాలి అంటే.. విజయ్‌కి సరైన విజయం వచ్చి ఎనిమిదేళ్లు అయింది అనే చేదు నిజం గుర్తు చేసుకోవాలి. 2018లో ‘ట్యాక్సీ వాలా’ సినిమా తర్వాత విజయ్‌కి ఇంకా సరైన హిట్‌ పడలేదు. కొన్ని సినిమాలకు ‘మనం కొట్టినం’ అని చెప్పుకున్నా ఆ విజయం విజయం అవ్వలేదు.

రీసెంట్‌గా ‘రణబాలి’ అంటూ భారీ అంచనాలతో వచ్చిన విజయ్‌కి ఆశించిన విజయం వచ్చిందా అంటే రాలేదనే చెప్పాలి. సినిమా వసూళ్లు ఎంత అనేది తెలియడం లేదు కానీ.. మంచి కలెక్షన్లే వచ్చాయని టీమ్‌ చెబుతోంది. అయితే అది ష్యూర్‌ షాట్‌ విజయం కాదు. సినిమా మీద రిలీజ్‌ అయిన రోజు నుండి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఫలితం మీద కూడా కామెంట్లు వచ్చాయి. దీంతో ఎక్కడ తేడా కొడుతోంది అనే చర్చ జరపాల్సిన అవసరం ఏర్పడింది.

గత ఎనిమిదేళ్లలో విజయ్‌ చాలా రకాల సినిమాలు చేశాక. ఫ్యామిలీ, యాక్షన్‌, ప్రయోగం.. ఇలా చాలా ట్రై చేశాడు. కానీ ఏదీ సరైన ఫలితం ఇవ్వలేదు. దీంతో మరోసారి తన థింక్‌ ట్యాంక్‌తో కూర్చొని ఏం జరుగుతోంది, ఎలా కథ ఎంచుకుంటే కెరీర్‌ నడుస్తుంది అనే లెక్కలు వేసుకోవాలి. అయిత అది ‘రౌడీ జనార్ధన’ తర్వాత జరగొచ్చు. ఎందుకంటే ఆ సినిమా కూడా పూర్తి యాక్షన్‌ నేపథ్యమే.

రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus