టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ అయినటువంటి రష్మిక మందన్న పెళ్లి ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 26 ఈరోజు అనగా గురువారం నాడు వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వైభవంగా జరిగింది. విజయ్ – రష్మిక సన్నిహితులు , బంధువుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. అంతేకాదు విజయ్- రష్మిక..ల వివాహం రెండు పద్ధతుల్లో జరిగినట్టు తెలుస్తుంది. తెలుగు సంప్రదాయం ప్రకారం ఈరోజు ఉదయం 10:10 గంటలకి రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశాడు.
అలాగే కన్నడ (కొడవ) సంప్రదాయం ప్రకారం… సాయంత్రం 4:00 గంటలకు రష్మిక ఫ్యామిలీ ఆచారాలు అంటే కూర్గ్ ఆచారాల ప్రకారం (కొడవ సంప్రదాయం) లో మరోసారి పెళ్లి చేసుకుంటారు. రష్మిక కర్ణాటక, కూర్గ్ కి చెందిన అమ్మాయి అనే సంగతి తెలిసిందే. వాళ్ళ ఆచారాలు మనతో అంటే తెలుగువారితో పోలిస్తే కొంచెం వేరుగా ఉంటాయి. ఇక వివాహ వేడుక అనంతరం గ్రాండ్ రిసెప్షన్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ను నిర్వహించనున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు,రాజకీయ నాయకులు వీరి పెళ్లి వేడుకలో సందడి చేసే అవకాశం ఉంది.
మరోపక్క విజయ్ దేవరకొండ- రష్మిక..ల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. వీరి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో విజయ్ – రష్మిక కలిసి నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఒకటి రెండు యాడ్స్ లో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. విజయ్ నెక్స్ట్ మూవీ ‘రన బాలి’ లో కూడా రష్మికనే హీరోయిన్.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14