ఈ విజయం దేవరకొండకు చాలా అవసరం

  • February 13, 2020 / 09:01 PM IST

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో భారీ ఇమేజ్ సొంత చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. తన పేరుకు తగ్గట్టే వరుస విజయాలు అతని స్టార్ డమ్ ని శిఖరానికి తీసుకెళ్లాయి. యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ సినిమాలకు సూపర్ డిమాండ్ ఉంది. ఎప్పటి నుండో పాతుకుపోయి స్టార్స్ హోదా అనుభవిస్తున్న వారిని వదిలేసి బాలీవుడ్ సైతం విజయ్ పేరు జపం చేస్తుంది. అక్కడి టాప్ హీరోయిన్స్ హాట్ ఫేవరేట్ స్టార్ గా విజయ్ ఉన్నాడు. బాలీవుడ్ బిగ్ షాట్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఎప్పటి నుండో విజయ్ వెనుక పడుతున్నాడు. చివరికి డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నిర్మాణ భాగస్వామి అయ్యాడు.

ఇక విజయ్ తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ రేపు తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల కానుంది. ఒక వేళ ఈ మూవీ కనుక భారీ విజయం సాధించిన నేపథ్యంలో విజయ్ క్రేజ్ మరోస్థాయికి చేరడం ఖాయం. టాలీవుడ్ నుండి స్టార్ హీరోలలో ఒకరిగా విజయ్ గుర్తింపు పొందే అవకాశం కలదు. విజయ్ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియాల్ లెవల్ లో విడుదల కానుంది. ఒక వేళ వరల్డ్ ఫేమస్ లవర్ విజయం సాధిస్తే హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అలా విజయ్ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకునే ఆస్కారం కలదు. అదే విధంగా ఈ చిత్రం ఫెయిల్ అయితే అదే స్థాయిలో విజయ్ కెరీర్ దెబ్బ తినే అవకాశం కలదు. ఆయన గత చిత్రం డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందిన నేపథ్యంలో ఈయనకు ఇది వరుసగా రెండో ప్లాప్ అవుతుంది. అది ఆయన కెరీర్ పై నెగెటివ్ ప్రభావం చూపే ప్రమాదం కలదు.

Most Recommended Video

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus