Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

కమల్ హాసన్ తప్పుకున్న తర్వాత విజయ్ సేతుపతి(Vijay Sethupathi) బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న 10వ సీజన్‌ను విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హోస్ట్ హోదాలో ఓ కంటెస్టెంట్‌కు క్లాస్ పీకే క్రమంలో విజయ్ సేతుపతి పలికిన కొన్ని మాటలు ఇప్పుడు తమిళనాట పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది.

Vijay Sethupathi

ఆ వీడియోను పరిశీలిస్తే.. “లీడర్ అంటే ఏంటో, లీడర్‌షిప్ అంటే ఏంటో కనీసం అవగాహన కూడా లేకుండా, నోటికి వచ్చినట్లు ఏవేవో హామీలు ఇచ్చేసి.. తీరా సమస్యలు, బాధ్యతలు వచ్చేసరికి అవతలి వారి మీద నెపం నెట్టేసి అక్కడి నుండి పారిపోవడం అనేది ఒక లీడర్ లక్షణం కాదు, అది కచ్చితంగా మోసం చేయడమే” అంటూ విజయ్ సేతుపతి ఒక కంటెస్టెంట్‌తో అన్నారు. ఇది కేవలం బిగ్ బాస్ వ్యవహారం మాత్రమే.

కాకపోతే కొంతమంది దీనిని వేరే విధంగా వైరల్ చేశారు. అది ‘టీవీకే(TVK)’ పార్టీకి కనెక్ట్ అయ్యింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. విజయ్ సేతుపతిపై విరుచుకుపడుతున్నారు. ‘విజయ్ సేతుపతి కావాలనే సీఎం విజయ్‌ను ఉద్దేశించి ఆ కామెంట్లు చేశారని.. వెంటనే ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో బిగ్ బాస్ హోస్ట్‌గా తప్పుకోవాలంటూ’ విజయ్ టీవీ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఈ క్రమంలో విజయ్ టీవీ వారు ముందుకొచ్చి ‘కేవలం బిగ్ బాస్‌లో భాగంగా మాత్రమే విజయ్ సేతుపతి అలా మాట్లాడారని, ఆయన ఎవ్వరినీ ఉద్దేశించి నెగిటివ్ కామెంట్లు చేయలేదని’ స్పష్టం చేశారు. అయినప్పటికీ విజయ్ ఫ్యాన్స్ తగ్గడం లేదు. విజయ్ సేతుపతిని పొలిటికల్‌గా లాగుతూ ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ సేతుపతి క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను వదిలితే తప్ప.. ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు.

వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus