బాలీవుడ్‌లో ఒకప్పుడు అక్షయ్ కుమార్ స్టైల్ కళ్లకు విందులా ఉండేది. మేం చెప్పేది సినిమాల్లో కనిపించే స్టైల్ కాదు. సినిమాలు ఓకే చేసి.. సెట్స్‌పైకి తీసుకొచ్చి.. రిలీజ్ చేసేసి.. మరో సినిమా స్టార్ట్ చేసేస్తూ ఉంటాడు. అందరు హీరోలు సినిమాకు సినిమాకు మధ్య నెలల గ్యాప్ ఇస్తే.. అక్షయ్ మాత్రం రోజుల గ్యాప్ ఇస్తాడు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. కానీ సౌత్‌లో ఇలాంటి ఫీట్ ఓ హీరో చేస్తున్నాడు. ఈ క్రమంలో మొత్తంగా 10 సినిమాలతో స్ట్రాంగ్ లైనప్ సెట్ చేసుకున్నాడు.
ఆ హీరోనే విజయ్ సేతుపతి. మామూలుగానే విజయ్ సేతుపతి వరుస సినిమాలు చేస్తుంటాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసేస్తుంటాడు. అలా ఇప్పుడు 10 ప్రాజెక్ట్‌లను రెడీ చేశాడు. కొన్ని సెట్స్ మీద ఉండగా, ఇంకొన్ని ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. మరికొన్ని చర్చల తుది దశలో ఉన్నాయి. వీటిలో అన్నీ పట్టాలెక్కుతాయనే అంచనా వేసుకుంటే 10 మూవీస్ లిస్ట్ వచ్చింది. మిస్కిన్ దర్శకత్వంలో ‘ట్రైన్’ అనే సినిమా ఈ జాబితాలో ఫస్ట్ ఉంటుంది.
పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం చేస్తన్న ‘స్లమ్ డాగ్’ రెండో సినిమా. ఆ తర్వాత రాబోయే చిత్రం బాలాజీ తరన్‌తీరన్ రూపొందిస్తున్న ‘పఠాన్’. ఆ వెంటనే ‘పాకెట్ నోవల్’ సినిమా రానుంది. దీనిని త్యాగరాజన్ కుమార రాజా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలు అయ్యాక రెండు స్పెషల్ కేమియోలు రానున్నాయి. ఒకటి రజనీకాంత్ ‘జైలర్ 2’ కాగా, మరొకటి ‘అరసన్’. వీటి తర్వాత ఇంకా సినిమాలు ప్రారంభం కాలేదు. ఆ మాటకొస్తే అనౌన్స్ కాలేదు.
అవే మణిరత్నం సినిమా. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ అని టాక్. ఆ తర్వాత మగిల్ తిరుమేని సినిమా ఉండబోతోంది. ఆ సినిమా తర్వాత చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న పాండిరాజ్ కాంబో ఉండబోతోంది. ఆ సినిమాతోపాటే నితిలన్ సామినాథన్ సినిమా స్టార్ట్ చేస్తారట. అలా మొత్తంగా 10 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.