Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Advertisement

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర అలాగే ఆమె పలికిన కొన్ని సన్నివేశాలు.. స్త్రీ జాతి మొత్తాన్ని అవమానించేలా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు గుప్పించారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు కోరుతూ ఓ ట్వీట్ వేశారు. అందులో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టే సన్నివేశాలు తొలగిస్తామని చెప్పుకొచ్చారు.

Anasuya Bhardhwaj

ఈ వ్యవహారాల్లో యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bhardhwaj) దూరి హైలెట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుకున్నట్టే ఆమె ఈ వివాదం పై స్పందించింది.’సినిమా అనేది ఒక కల్పిత కథ. ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకునే విచక్షణ జ్ఞానం ప్రేక్షకుడికే ఉంటుంది. కేవలం సినిమాలు చూసే పిల్లలు చెడిపోతున్నారనడం సరికాదు. దర్శకులకు కథ చెప్పే స్వేచ్ఛ ఉండాలి, అలాగే సమాజం పట్ల బాధ్యత కూడా ఉందనే విషయం మర్చిపోకూడదు.

సమాజంలోని చెడును కేవలం పాత్ర పరంగా చూపించారా? లేదా దాన్నే గ్లోరిఫై చేస్తున్నారా? ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్రియేటర్లు గమనించాలి.ఒక తప్పును ప్రేక్షకులు ప్రశ్నించడం అనేది క్రియేటివిటీని తక్కువ చేసినట్టు కాదు, అదొక ఆరోగ్యకరమైన మార్పుగా భావించాలి. ఇకనైనా క్రియేటర్లు బాధ్యతాయుతంగా కంటెంట్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను’ అంటూ అనసూయ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

అంతా బాగానే ఉంది.. ‘కాకపోతే అనసూయ ‘అర్జున్ రెడ్డి’ విషయంలో ఎందుకు ఇలా ఆలోచించకుండా.. అప్పట్లో అంత గొడవ చేసినట్టు’ వంటి అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus