విజయ్ సేతుపతి, ఎన్టీఆర్ కొట్టుకుంటే..

  • February 23, 2021 / 11:36 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీజయ్ సేతుపతికి క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ కారణంగా కమర్షియల్ సినిమాలను కాకుండా వేరే లాంగ్వేజ్ సినిమాలపై మన ఆడియెన్స్ బాగానే ఫోకస్ పెట్టారు. విజయ్ సేతుపతి సినిమాలను చూసి అతనికి ఫ్యాన్ అయిపోయారు. సేతుపతి ఎలాంటి సినిమా చేసినా రెస్పాన్స్ స్ట్రాంగ్ గా వస్తోంది. అతను సినిమాలో నటిస్తున్నాడు అంటే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.

మాస్టర్ సినిమాకు తెలుగులో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ రావడానికి కారణం కూడా సేతుపతి అనే చెప్పాలి. ఇక ఉప్పెన సినిమాతో సేతుపతి క్రేజ్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక తెలుగు దర్శకులు సేతుపతిని గట్టిగా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు. విలన్ పాత్రలను చేయించడానికి ట్రై చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ సినిమాలో కూడా విజయ్ సేతుపతి నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బిగ్ స్క్రీన్ పై ఎన్టీఆర్ – విజయ్ సేతుపతి లాంటి టాలెంటెడ్ స్టార్స్ కొట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus