Vijay,Namrata: విజయ్,నమ్రత..ల ఫోటోల వెనుక ఉన్న అసలు కథ..!

  • March 11, 2024 / 11:21 AM IST

విజయ్ (Thalapathy Vijay) కోలీవుడ్ స్టార్ హీరో. గత 5 ఏళ్లలో తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు విజయ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అతను హీరోగా తెరకెక్కిన (Kushi) ‘ఖుషి’ ‘కత్తి’ (Kaththi) వంటి సినిమాలు తెలుగులోనూ రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయినప్పటికీ తెలుగు మార్కెట్ పై మొదట విజయ్ ఫోకస్ పెట్టలేదు. విజయ్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయినా జనాలు పట్టించుకోలేదు.

కానీ ‘తుపాకీ’ (Thuppakki) నుండి సీన్ మారింది. తెలుగులో కూడా విజయ్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇప్పుడైతే కొంతమంది మిడ్ రేంజ్ హీరోలకంటే కూడా విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి అని చెప్పాలి. ‘లియో’ (LEO) సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ రూ.25 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే..

విజయ్ తో మహేష్ (Mahesh Babu) భార్య నమ్రత (Namrata) ఉన్న కొన్ని పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవి సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫొటోలే అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. గతంలో అంటే 2003 లో విజయ్ హీరోగా ‘తిరుమలై’ (Thirumalai) అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఇందులో జ్యోతిక (Jyothika) హీరోయిన్. వాస్తవానికి ముందుగా ఈ సినిమాలో నమ్రతని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.

కొంత భాగం షూటింగ్ అయ్యాక ఆమె తప్పుకుంది. దీంతో జ్యోతికని రీప్లేస్ చేశారు మేకర్స్. అయితే ఆ సినిమా షూటింగ్లో నమ్రత పాల్గొన్న టైంలో తీసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ‘తిరుమలై’ సినిమాని (Gowri) ‘గౌరి’ పేరుతో తెలుగులోకి కూడా రీమేక్ చేయగా.. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus