Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

‘భగీరథ’ ‘షాక్’ సినిమాల ఫలితాలతో రవితేజ డల్ అయిన టైమ్ అది. సైలెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో ‘విక్రమార్కుడు'(Vikramarkudu) చేశాడు. మొదట ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు.కేవలం మౌత్ టాక్ పై ఆదారపడి 2006 జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ‘శ్రీ కీర్తి క్రియేషన్స్’ బ్యానర్ పై ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మించిన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్. అప్పటికి అనుష్కకి సరైన సక్సెస్ కూడా లేదు. ఈ ప్రాజెక్టుకి ఆ టైమ్లో ఇదొక నెగిటివ్ వైబ్ అనుకోవాలి.

Vikramarkudu

అయితే మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ‘విక్రమార్కుడు’ సినిమా. అత్తిలి సత్తిబాబుగా కామెడీ పండించడమే కాకుండా విక్రమ్ సింగ్ రాథోడ్ వంటి సీరియస్ రోల్లో చాలా పవర్ఫుల్ గా ఈ సినిమాలో అలరించాడు రవితేజ.

అజయ్ విలనిజం కూడా ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బ్రహ్మానందం కామిడీ కూడా ఈ సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించాయి.నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.94 cr
సీడెడ్ 1.96 cr
ఉత్తరాంధ్ర 2.06 cr
ఈస్ట్ 0.97 cr
వెస్ట్ 0.92 cr
గుంటూరు 1.66 cr
కృష్ణా 1.42 cr
నెల్లూరు 0.76 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 15.69 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 3.26 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.95 cr

‘విక్రమార్కుడు’ చిత్రం రూ.11.93 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.18.95 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.7.02 కోట్ల లాభాలతో బయ్యర్లని సేవ్ చేయడమే కాకుండా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus