Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇలా అవకాశం వచ్చిన ప్రతి చోట తనలోని నటుడ్ని నిరూపించుకుంటూ బాలీవుడ్ లో హీరోగా ఎదిగిన నటుడు విక్రాంత్ మాసే. ఈయన ఒక విలక్షణమైన నటుడు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకు అంటే 2023 లో విడుదలైన 12th ఫెయిల్ మూవీ ద్వారా ఇండియా వైడ్ గా తన నటన యొక్క సత్తా ఏంటో తెలియజేసి, ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసాడు విక్రాంత్. ఆ మూవీ లో తన చేసిన క్యారెక్టర్ నిజజీవితంలో ఒక సాధారణ వ్యక్తి, IPS ఆఫీసర్ అవ్వటానికి పడ్డ కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు చేసి చూపించాడు. అయితే ఈ హీరో ఆ మధ్య సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తెలపటంతో అభిమానులు కలవరపడ్డారు. తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ విక్రాంత్ ఇలా అన్నారు.

Vikranth

రోజుకు నిత్యం 16 గంటలు పనిచేస్తూ ఉండటం వలన, తన కుటుంబానికి సమయం కేటాయించలేకపోయానని గ్రహించానని ఆ కారణంతోనే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నానని తెలిపారు. అయితే దానికి సంబంధించి చేసిన పోస్ట్ ను ఆడియన్స్ వేరేలా అర్ధం చేసుకున్నారని తెలిపారు. తన భార్య, కొడుకు కి తగినంత సమయం కేటాయించటంతో తన మనసు చాలా ప్రశాంతంగా ఉందని తెలిపాడు. అయితే ఈ మద్యే కొన్ని సినిమాలకు సంబందించిన స్క్రిప్టులను వినటం జరిగింది అని , అతి త్వరలోనే ఆ షూటింగ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పుకొచ్చారు. ఈ వార్త పట్ల సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus