Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Advertisement

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘అతనొక్కడే’ మూవీ తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఆ తరువాత విభిన్న చిత్రాలను డైరెక్ట్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన మూవీస్ లో హీరో క్యారేక్టరైజెషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అలాగే హీరో అవతార్ కూడా మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్ గా చూపించటంలో దిట్ట సురేందర్ రెడ్డి. అయితే రీసెంట్ గా తీసిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం సురేందర్ రెడ్డి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబో లో ఒక చిత్రానికి సంబంధించి వర్క్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఆ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Pawan Kalyan

అదేంటంటే.. ఈ మూవీలో పవర్ స్టార్ సరసన ఒక కొత్త హీరోయిన్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఆమె ఎవరంటే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పౌజీ’ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న ముద్దుగుమ్మ ఇమాన్వి. ఈ భామ ను డైరెక్టర్ సంప్రదించగా, ఓకే చేసినట్టు సినీ వర్గాల భోగట్టా. కాగా, ఈ విషయంపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చ్ 26న సమ్మర్ కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంట్లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus