నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం.. ఇలా ఏదైనా సరే నార్మల్‌ మనుషులకు చెప్పుకోవడానికి కాస్త స్వేచ్ఛ ఉంటుంది. అదే సెలబ్రిటీకి అనారోగ్యం చేస్తే కచ్చితంగా బయటకు చెప్పుకోవడం అంత ఈజీ కాదు. ఎన్నో ఆలోచనలు, అనుమానాలు, ఇబ్బందుల నడుమ తమ అనారోగ్యం గురించి బయటకు చెబుతుంటారు. ఇలా చెప్పినవారు కూడా చాలా తక్కువమంది. ఒక సెలబ్రిటీల చెబితే.. ఆ వెంటనే కొంతమంది ఇలా బయట పడుతుంటారు. అలా బయటకు వచ్చి చెప్పినవారిలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకొణె, సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత లాంటివారు ఉన్నారు.

Vishnu Vishal

హీరోల్లో ఇలా చెప్పేవారు ఈ మధ్య కాలంలో ఎవరూ లేరు. అయితే తాను గత మూడు, నాలుగేళ్ల నుండి ఆటో ఇమ్యూన్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తమిళ నటుడు విష్ణు విశాల్‌ తాజాగా చెప్పుకొచ్చాడు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘గట్టి కుస్తీ 2’ / ‘మట్టి కుస్తీ 2’ సినిమా జులై 3న విడుదల అవుతున్న సందర్భంగా మీడియా ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో తన ఆరోగ్య సమస్య గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. దీంతో ఆ పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నా ముఖం అలసిపోయినట్లు ఉండటం చూసి కొంతమంది అడుగుతూ ఉంటారు. అందుకు కారణం ఆటో ఇమ్యూన్‌ కండీషన్‌. గత నాలుగేళ్లుగా నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను. తరచూ మందులు వాడుతున్నాను. దీని వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌లు ఎక్కువయ్యాయి. అందుకే ఇలా కనిపిస్తున్నాను అని ఓపెన్‌ అయ్యాడు విష్ణు విశాల్‌. దీని కారణంగా తరచూ శరీరం, కడుపు ఉబ్బరంగా అనిపిస్తాయి అని చెప్పుకొచ్చాడు. ‘మట్టి కుస్తీ 2’ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి శ్రమ నన్ను ముందుకు నడిపిస్తోంది అని చెప్పారు.

అందుకే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా సినిమా ప్రచారంలో పాల్గొంటున్నా. త్వరలోనే నా ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను అని చెప్పిన విష్ణు విశాల్‌.. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు. 2022లో వచ్చి మంచి విజయం అందుకున్న ‘గట్టి కుస్తీ’/ ‘మట్టి కుస్తీ’కి సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతోంది.

సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus