Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Advertisement

ఈరోజు విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ ‘కల్ట్'(Cult) కి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ చాలా వయొలెంట్ గా అనిపించింది. దారుణమైన విజువల్స్ ఉన్నాయి. అందువల్ల ఎక్కువగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాకి చిన్న పిల్లలు, ఫామిలీ ఆడియన్స్ దూరంగా ఉండాలని స్వయంగా హీరో విశ్వక్ సేన్ సూచించడం గమనార్హం.

Cult

అయితే ‘కల్ట్’ టీజర్ ఆడియన్స్ కి ఎలా అనిపించినా.. ఒకవేళ మిక్స్డ్ రెస్పాన్స్ వినిపించినా.. ఒక్క విషయంలో మాత్రం అంతా ఏకీభవించి అభినందిస్తారు. అదే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో.

అవును ‘కల్ట్’ టీజర్ కి ఎక్కవ మార్కులు పడేది ఈ విషయంలోనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు టీజర్లో అంతా ఇన్వాల్వ్ అవ్వడానికి ముఖ్య కారణం రవి బసృర్ అందించిన బ్యాక్ గ్రౌండ్.ఆయన టీజర్ మూడ్ ని కరెక్ట్ గా డ్రైవ్ చేశాడు. సినిమాకి కూడా అద్భుతమైన ఆర్.ఆర్ అందించాడు అని విశ్వక్ సేన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు.

అందుకే స్టేజిపై అతనికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహూకరించాడు.దీంతో రవి బసృర్ చాలా ఎమోషనల్ అయ్యాడు.గతంలో తనకి 24 గంటలు మ్యూజిక్ వాయించే పని ఉంటే.. సరిపోతుంది అని అనుకునేవాడట. అయితే ఈ 25 ఏళ్లలో అతను వాయించిన మ్యూజిక్ ని మాత్రమే అంతా చూశారని. కానీ మొదటిసారి ఒకడు తన సోల్(ఆత్మ) చూశాడని.. అది హీరో విశ్వక్ సేన్ అని రవి బసృర్ చెప్పుకొచ్చాడు.

‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus