Viva Harsha Wedding Photos: ఘనంగా పెళ్లి చేసుకున్న వైవా హర్ష.. ఫోటోలు వైరల్!

వైవా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా వైవా హర్ష ఓవర్ నైట్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. నిన్న హైదరాబాద్ లో వైవా హర్ష వివాహం గ్రాండ్ గా జరిగింది. వైవా హర్ష పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు మారుతి పెళ్లి కొడుకు హర్షతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది. కమెడియన్ ప్రవీణ్, నిర్మాత ఎస్కేఎన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు.

సినీ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించడంతో పాటు శుభాకాంక్షలను తెలియజేశారు. వైవా హర్ష పలు సినిమాలలో కూడా నటించి క్రేజ్ ను అంతకంతకూ పెంచుకున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో వైవా హర్ష అక్షర అనే యువతిని పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించారు. జనవరి నెల 8వ తేదీన హర్ష అక్షర ల ఎంగేజ్ మెంట్ జరిగింది. హర్ష ఒక ఇంటివాడు కావడంతో ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కలర్ ఫోటో సినిమా హర్షకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

2014 సంవత్సరంలో విడుదలైన మై నే ప్యార్ కియా సినిమా హర్షకు తొలి సినిమా కావడం గమనార్హం. హర్ష ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. కరోనా నిబంధనల వల్ల పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థ వేడుకను జరుపుకున్న హర్ష పెళ్లి వేడుకను మాత్రం గ్రాండ్ గా జరుపుకున్నారు. హర్ష పెళ్లి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

1

2

3

4

5

6

7

8

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus