Waltair Veerayya: వాల్తేరు వీరయ్య స్టోరీ లీక్ చేసిన విలన్.. ఏం చెప్పారంటే?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న సినిమాలలో వాల్తేరు వీరయ్య సినిమా ఒకటి కాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రేపు రిలీజ్ కానుంది. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఒకటిగా నిలిచిపోవడంతో పాటు ఫ్యాన్స్ కోరుకున్న సక్సెస్ ను సందిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ గా నటించిన రోహిత్ పాఠక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు.

వాల్తేరు వీరయ్యలో నేను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించానని ఫస్ట్ ఫైట్ నుంచి నా రోల్ మలుపు తిరుగుతుందని తెలిపారు. సముద్రంపై ఆధిపత్యం చలాయించే పాత్రలో ఈ సినిమాలో నేను కనిపిస్తానని మరో విధంగా చెప్పాలంటే నేను సముద్రానికి రాజునని రోహిత్ పాఠక్ అన్నారు. సినిమాలో నాది బంగ్లాదేశ్ అని తీరప్రాంతం గురించి బాగా తెలిసిన వ్యక్తి అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్ లో కూడా నేను కనిపిస్తానని రోహిత్ పాఠక్ కామెంట్లు చేయడం గమనార్హం.

చిరంజీవికి, నాకు మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయని రోహిత్ పాఠక్ తెలిపారు. రోహిత్ పాఠక్ సినిమాకు సంబంధించిన కథను లీక్ చేసేశారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ట్రైలర్ తో పాటే ఈ సినిమాలోని కొన్ని ప్రత్యేకతలు రివీల్ కానున్నాయి.

సంక్రాంతి సినిమాలకు థియేటర్ల విషయంలో భారీ పోటీ నెలకొనగా చిరంజీవి సినిమాకు బెస్ట్ థియేటర్లు దక్కేలా అభిమానులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus