Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

వామికా గబ్బి.. బాలీవుడ్‌లో గత కొన్ని ఏళ్లుగా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. అమె అందం, ఫిగర్‌, లుక్స్‌, ఐస్‌.. ఇలా ఒక్కటేంటి చాలా అంశాల గురించి చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఆమె చేసిన ఓ సినిమాలోని సన్నివేశాలు, ఆ తర్వాత ఆమె తనను తాను ఆఫ్‌ స్క్రీన్‌ చూపించుకున్న విధానం. ఆమె గురించి గతకొన్ని రోజులుగా సౌత్‌ సినిమాలో కూడా మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఆమె చేసిన ‘డిసి’ సినిమా.

Wamiqa Gabbi

ఆ సినిమాలో వామికా గబ్బి కనిపించి మెప్పించిన తీరుకు ఫ్యాన్స్‌ బాగా పెరిగిపోయారు. ఈ క్రమంలో ఆమె ఓ పాన్‌ ఇండియా సినిమాను ఓకే చేసింది అని టాక్‌. అదే ‘జై హనుమాన్‌’. రిషభ్‌ శెట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో వామికాను ఓ ముఖ్య పాత్ర కోసం తీసుకున్నారు అని చెబుతున్నారు. త్వరలోనే ఆమె సెట్స్‌లో అడుగుపెడుతుంది అని టాక్‌. అయితే హనుమంతుడి నేపథ్యంలో వచ్చే ఈ సినిమాలో ఆమె ఏ పాత్ర చేయనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఆమెకు తెలుగులో ఎంట్రీ ఏమీ కాదు. ఎందుకంటే సుమారు 11 ఏళ్ల క్రితం వామికా తెలుగులోకి వచ్చింది. సుధీర్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘భలే మంచి రోజు’ సినిమాలో ఆమెనే నాయిక. ఆ సినిమా మోస్తారు విజయం అందుకున్నా.. ఆమెకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు ‘జై హనుమాన్‌’ సినిమా కూడా ఆమెకు రీఎంట్రీ కాదు. అదేంటి అనుకుంటున్నారా? అడివి శేష్‌ చేస్తున్న ‘గూఢచారి 2’ని తొలుత ఓకే చేసింది కాబట్టి.

ఈపాటికే ‘జీ 2’ సినిమా రావాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. మరి ‘జై హనుమాన్‌’ ముందు వస్తుందో లేక ‘జీ 2’ ముందు వస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అడివి శేష్‌ త్వరగా తేలిస్తే అదే ఆమె రీఎంట్రీ సినిమా.

నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus