అనుపమ పరమేశ్వరన్ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అని అడిగితే.. మొన్నీ మధ్య వరకు ఓ తెలుగు కుర్ర స్టార్ హీరో పేరు వినిపించేది. అయితే ఇద్దరూ విడిపోయారు అని తేలిన తర్వాత ఆమె సింగిలే అనుకుంటూ వచ్చారంతా. అయితే ఆమె మళ్లీ రిలేషన్‌లోకి వెళ్లింది అని తేలింది. అంతే కాదు ఆ రిలేషన్ కూడా తెగిపోయింది. ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా? ఏమో ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పుకొచ్చింది. తానొక వ్యక్తిని ప్రేమించానని. కానీ నరకం చూశాక అతనికి దూరంగా వచ్చేశాను అని చెప్పింది. దీంతో ఆమె మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Anupama నిజానికి, అనుపమ ఓ రిలేషన్‌లో ఉందని కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఓ యువ హీరోతోనే ఆమె రిలేషన్‌లోకి వెళ్లింది అని కూడా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే ఆ హీరోకు, ఈమెకు మధ్యలో వయసులో గ్యాప్ ఎక్కువగా ఉండటంతో ఇది నిజం కాదేమో అని కూడా అనుకున్నారు. అయితే అదే నిజం అనిపించేలా ఆమె ప్రస్తుతం మాటలు ఉన్నాయి. మన పార్ట్నర్ పక్కన ఉంటే ప్రశాంతంగా, సురక్షితంగా భావిస్తాం. కానీ నేను బంధంలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం భయం, ఆందోళనతో గడిపేదాన్ని అని చెప్పింది. నేను రెండేళ్లుగా నార్సిసిస్టిక్ అబ్యూజ్ అనుభవించాను. నేను ఆ వ్యక్తి పేరు చెప్పాలని అనుకోవడం లేదు. కొంతమంది ప్రారంభంలో మనపై ఎంతో ప్రేమను కురిపిస్తారు. జీవితంలో ఇలాంటి వ్యక్తి దొరకడం నిజమేనా, ఇది కలలా ఉంది అనిపిస్తుంది. కానీ, మరుసటి రోజు అదే వ్యక్తి క్రూరంగా ప్రవర్తిస్తాడు. తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తాడు. ఆ తర్వాత రోజు మళ్లీ క్షమాపణ కోరుతూ.. మరోపసారి అలా చేయనని ప్రామిస్ చేస్తాడు. కానీ ఆ తర్వాత ఇదే సీన్ రిపీట్ అవుతుంది అంటూ తన రిలేషన్ గురించి చెప్పింది. అయితే ఇదంతా తనను సినిమాల నుండి తప్పించి.. పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని తెలిసింది. ఈ విషయం అర్థమయ్యే ఎంగేజ్మెంట్ వాయిదా వేస్తూ వచ్చాను. ఒత్తిడి నుండి బయటపడేందుకు మందులు కూడా వాడాను. ఈ క్రమంలో ‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్స్ కూడా రాలేకపోయాను. ఒక దశలో సినిమాలు కూడా వదులుకున్నాను. నా ఫ్రెండ్స్‌కు దూరమయ్యాను. ఎవరైనా నన్ను ప్రేమగా పలకరిస్తే ఏడ్చేసే పరిస్థితిలోకి వచ్చాను. ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఓ రోజు రెమోలా, మరో రోజు అపరిచితుడులా మారిపోతుంటాడు అని చెప్పింది అనుపమ. ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే https://www.youtube.com/watch?v=IxsiviVHqyA