ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మూవీ ‘వార్ 2′(War 2). బాలీవుడ్లో ఎన్టీఆర్ చేసిన మొదటి స్ట్రైట్ మూవీ ఇది. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారి స్పై యూనివర్స్ లో భాగంగా ఆదిత్య చోప్రా రూపొందించిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం చేయగా….2025 ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న రిలీజ్ చేశారు.
మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా హైప్ కలిసొచ్చి మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ మొదటి వీకెండ్ తర్వాత డౌన్ అయ్యింది.
ఆ తర్వాత కోలుకుంది లేదు. హాలిడేస్ సీజన్ ను కూడా సరిగ్గా వాడుకోలేకపోయింది ‘వార్ 2’. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 11.06 cr |
| సీడెడ్ | 8.16 cr |
| ఉత్తరాంధ్ర | 5.46 cr |
| ఈస్ట్ | 2.92 cr |
| వెస్ట్ | 2.07 cr |
| గుంటూరు | 3.45 cr |
| కృష్ణా | 2.70 cr |
| నెల్లూరు | 1.76 cr |
| ఏపీ+తెలంగాణ టోటల్ | 37.58 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.50 cr |
| తమిళనాడు+కేరళ | 1.3 cr |
| ఓవర్సీస్ | 3.08 cr |
| టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) | 45.46(షేర్) |
‘వార్ 2’ చిత్రానికి (తెలుగు వెర్షన్) రూ.87.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.88 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.45.46 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.83.65 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.42.54 కోట్ల నష్టాలతో డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ‘వార్ 2’.