ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు మార్కెట్ ను పెంచుకుంటూ పాన్ ఇండియా హీరోలుగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్1లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. నిజజీవితంలో కూడా బన్నీ తారక్ క్లోజ్ గా ఉంటారు.
ఒకరినొకరు బావా అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. సందర్భం వచ్చిన ప్రతి సమయంలోనూ ఈ హీరోలు ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకున్నారు. అయితే హీరోలు బాగానే ఉన్నా అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో గొడవ పడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ చెప్పలేని బూతులతో సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తూ బన్నీ, ఎన్టీఆర్ పరువు తీసేలా ఫ్యాన్స్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ఫ్యాన్స్ వార్ కు అసలు కారణం తెలియలేదు.
కొంతమంది మాత్రం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా అధికారక ప్రకటన వల్లే బన్నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ మొదలైందని అభిప్రాయపడుతున్నారు. కొన్ని నెలల క్రితం బన్నీతో ప్రశాంత్ నీల్ సమావేశమైనా ఈ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వెలువడలేదు. ఈ రీజన్ వల్లే ఫ్యాన్స్ వార్ మొదలైందని ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరోలు అభిమానులు కలిసి ఉండాలని కోరుకుంటున్నా అభిమానులు మాత్రం హీరోలకు చెడ్డపేరు వచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?