హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్(Jr NTR) కాంబినేషన్లో ‘వార్ 2’ (War 2) అనే భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ చేస్తున్న స్ట్రైట్ బాలీవుడ్ సినిమా. ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ సంస్థ నిర్మిస్తోంది. ఆదిత్య చోప్రా (Aditya Chopra) కథ అందించగా శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లేని సమకూర్చారు.
ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ నుండి చిన్న గ్లింప్స్ వదులుతున్నట్లు హీరో హృతిక్ రోషన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అతను చెప్పినట్టుగానే ఈరోజు 11 గంటలకు ‘వార్ 2’ టీజర్ వదిలారు మేకర్స్. ఈ టీజర్ విషయానికి వస్తే ఇది 1:34 నిమిషాల నిడివి కలిగి ఉంది.’నా కళ్ళు నిన్ను ఎప్పట్నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్… ‘ అంటూ ఎన్టీఆర్ గంభీరంగా డైలాగులు పలుకుతున్న టైంలో హృతిక్ ఎంట్రీ ఇచ్చాడు.
ఇందులో ‘వార్ 2’ (War2) వరల్డ్ ను అంటే ఒక రకంగా యుద్ధభూమిని.. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ను పరిచయం చేశారు అని చెప్పొచ్చు.గ్లింప్స్ మొత్తం యాక్షన్ బ్లాక్స్ తో నిండి ఉంది. మునుపెన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ ఇందులో నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తున్నాడు. అలాగే స్టైలిష్ గా కూడా ఉన్నాడు. టీజర్ చివర్లో ఎన్టీఆర్ – హృతిక్ ఫైట్ కి సంబంధించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :