పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో ‘ఓజి’ (OG Movie) అనే సినిమా రాబోతుంది. డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఈ సినిమాకి నిర్మాత. పవన్ రీ ఎంట్రీలో ఓకే చేసిన ‘ఓజి’… సినిమాలకు గుడ్ బై చెబుతున్న టైంలో రానుంది అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఉప రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో చాలా బిజీగా గడుపుతున్న ఈ సమయంలో కూడా ‘ఓజి’ కి డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
టీజర్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. ‘అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడు అంటే’ అనే ఒక్క డైలాగ్.. చాలా ఇంపాక్ట్ చూపించింది. ప్రతి పవన్ అభిమాని ఈ టీజర్ ను రోజుకు ఒక్కసారైనా చూడకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కొంత పార్ట్ బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఇటీవల కీలక భాగాన్ని చిత్రీకరించారు.
ఇక చివరి షెడ్యూల్ ను ముంబైలో ప్లాన్ చేశారు. దీనికి కోసం పవన్ 2,3 రోజులు డేట్స్ ఇవ్వాలి. బ్యాలెన్స్ పార్ట్ ను బాడీ డబుల్, డూప్ షార్ట్స్ లో మేనేజ్ చేసేయాలని దర్శకుడు సుజిత్ అండ్ టీం భావిస్తున్నట్టు టాక్.ఇక ముంబై షెడ్యూల్ ముగిశాక తాడేపల్లిలో ఓ సెట్ వేసి ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అని తెలుస్తుంది. సెప్టెంబర్ లో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు.