మూడున్నరేళ్ల క్రితం అనుకుంటాం… ఓ సినిమా అనౌన్స్ అయింది. ఇప్పటివరకు ఆ సినిమా ఇంకా మొదలుకాలేదు. ఈ విషయం గురించి ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినప్పుడు ‘అలా ఏం కాదు.. మేం ఆ సినిమా చేస్తున్నాం’ అంటుంటాడు ఆ హీరో. వాళ్ల టీమ్ కూడా పదే పదే అదే మాట చెబుతుంటుంది. అయితే రీసెంట్‌గా రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అనౌన్స్ అవ్వడంతో మరోసారి ఆ సినిమా గురించి చర్చ మొదలైంది. అసలు సినిమా ఉందా? లేక పూర్తిగా పక్కన పెట్టేశారా అనే డౌట్ మరోసారి చర్చలోకి వచ్చింది.
ఒకవేళ ఆపేస్తే ఆ విషయం చెప్పేయొచ్చు కదా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. పైన చెప్పిన ‘ఆ సినిమా’ అంటే… విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) – సుకుమార్ (Sukumar) సినిమా అని అర్థం. ఎప్పుడో సెప్టెంబరు 2020లో ఫాల్కన్ క్రియేషన్స్ అనే బ్యానర్ మీద విజయ్ దేవరకొండ – సుకుమార్ సినిమా ఉంటుంది అని న్యూస్ రిలీజ్ చేశారు. ఆ సినిమా 2022లో వస్తుంది అని కూడా చెప్పేశారు. అయితే ‘పుష్ప’ (Pushpa) సినిమా అయ్యాక ఆ సినిమా ఉంటుంది అన్నారు.
కానీ అవ్వలేదు. పోనీ ఇప్పుడు రెండో ‘పుష్ప’ వచ్చాక అయినా చేస్తారేమో అనుకుంటే… ఇప్పుడు సుకుమార్ తన తర్వాతి సినిమా రామ్‌చరణ్‌తో అని ప్రకటించేశారు. దీంతో విజయ్ సినిమా సంగతేంటి అని అడుగుతున్నారు. నిజానికి విజయ్‌తో అప్పుడు సుకుమార్ సినిమా అనౌన్స్ అయినప్పుడు… రౌడీ హీరో ఫుల్ ఫామ్‌లో ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరోవైపు ఇప్పుడు లెక్కల మాస్టారు పాన్ ఇండియా డైరక్టర్ అయిపోయారు.
ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి ఓ బ్లాక్ బస్టర్ సర్వ్ చేస్తే అదిరిపోతుంది. మరి ఎందుకు ఈ సినిమా మెటీరియలైజ్ అవ్వడం లేదు అనేది ప్రశ్నగా మారింది. అయితే విజయ్ టీమ్ నుండి ‘విజయ్ – సుకుమార్ సినిమా ఉంది. చరణ్ సినిమా తర్వాత స్టార్ట్ అవ్వొచ్చు’ అనే స్టేట్‌మెంట్ వస్తుందేమో చూడాలి.
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్